కాజల్ అగర్వాల్‌కి పెళ్లి ఫిక్స్ ( Kajal Aggarwal marriage ) అయింది అని మనం గతంలోనే చెప్పుకున్నాం. ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందని చెప్పుకున్నట్టుగానే తాజాగా కాజల్ పెళ్లి ప్రకటన వచ్చేసింది. కాజల్ స్వయంగా ఆ వివరాలను ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అభిమానులకు వెల్లడించింది. ఈ నెల 30న.. అంటే అక్టోబర్ 30 నాడు ( Kajal Aggarwal wedding date) తాను ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నానని కాజల్ తెలిపింది. అతికొద్ది మంది ఆత్మీయుల మధ్య ఈ పెళ్లి జరగనున్నట్టు కాజల్ వివరించింది. Also read : RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది.. వీడియో రిలీజ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"194461","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kajal-aggarwal-wedding-date-venue-Kajal-aggarwals-husband","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kajal-aggarwal-wedding-date-venue-Kajal-aggarwals-husband","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Kajal-aggarwal-wedding-date-venue-Kajal-aggarwals-husband","class":"media-element file-default","data-delta":"1"}}]]


గౌతం కిచ్లు ( Gautam Kitchlu ) అనే వ్యాపారవేత్తను కాజల్ పెళ్లి చేసుకుంటోంది. తన పెళ్లి విషయం ప్రకటించడంపై ఎంతో ఆనందం వ్యక్తంచేసిన కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటాను అని చెప్పి పరోక్షంగా తాను సినిమాల్లో కంటిన్యూ అవుతానని స్పష్టంచేసింది. ఇప్పటివరకు తనని ఆదరించినందుకు ఆడియెన్స్‌కి అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన కాజల్.. తమ కొత్త జీవితానికి కూడా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నట్టు విజ్ఞప్తిచేసింది. Also read : Sushant Singh Rajput: రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు


కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆచార్య మూవీలో ( Acharya movie ) చిరంజీవి సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ ( Kamal Haasan ) సరసన భారతీయుడు 2 సినిమా కూడా చేస్తోంది. ఇవే కాకుండా కాజల్ చేతిలో ఇంకొన్ని వేరే చిత్రాలున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe