Kajal Satyabhama review: చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ రాగానే.. కమర్షియల్ సినిమాలకి దూరమై ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే అందరికీ ఇది వర్క్ అవుట్.. అయితే అవ్వదు. కొందరు అదృష్టం బాగుండి..ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంటారు. కానీ మరికొందరి పరిస్థితి మాత్రం.. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు.. కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అదృష్టం కూడా వీళ్ళని వరించడంతో.. ఇద్దరు హీరోయిన్లు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా చేస్తూ కెరియర్ లో.. బాగానే సెటిల్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తే.. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. 


తాజాగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. నిన్న మొన్నటిదాకా.. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో.. ముందుకు దూసుకు వెళ్లిన కాజల్.. పెళ్లి చేసుకున్న తర్వాత తన రూట్ మార్చేసింది. పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న కాజల్.. సత్యభామ సినిమాతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు.. కూడా తీయడం మొదలు పెట్టింది.


కానీ ఫిమేల్ సెంట్రిక్ జోనర్ లో మొదటి సినిమాతోనే కాజల్ అగర్వాల్.. చేతులు కాల్చుకుందని చెప్పుకోవచ్చు. మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని మాత్రమే అందుకుంది. కనీసం యావరేజ్ టాక్ కూడా లేకపోవడంతో.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా ప్రయాణిస్తుంది. 


దీంతో కాజల్ అగర్వాల్ చేసిన.. మొదటి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సినిమాలతో.. బ్లాక్ బస్టర్లు అందుకుంటూ.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. అంటూ ఆమెనే నిలదీస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇకనైనా కాజల్ అగర్వాల్.. మళ్లీ కమర్షియల్ సినిమాలు చూస్తుందా.. లేక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుందో వేచి చూడాలి.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter