Kalatapasvi K Viswanath Last Pic కళాతపస్వి కే విశ్వనాథ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూనే ఉన్నారు. ఇక నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే కళాతపస్వి ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు. ఆయన పుట్టిన రోజున చిరంజీవి వెళ్లి విషెస్ చెప్పడమో లేదా ఇతర సెలెబ్రిటీలు ఎవరైనా వెళ్లి కలిసిన సందర్భంలోనే ఆయన ఫోటోలు బయటకు వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా గత నెల చివరి వారంలో ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అది బండ్ల గణేష్‌ షేర్ చేసిన ఫోటో. కళాతపస్విని కలిసినట్టుగా, ఓ గంట సేపు ముచ్చట్లు పెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలోనూ ఆయనకు డయాలిసిస్ చేయించుకున్నట్టుగా కనిపించింది. బెడ్డు మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగానే అనిపించింది.


 




సోషల్ మీడియాలో బయటకు వచ్చిన చివరి ఫోటో అంటే దాదాపుగా అదే అవుతుంది. అదే ఫోటోను మళ్లీ షేర్ చేశాడు బండ్ల గణేష్. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం అంటూ బండ్ల గణేష్ సంతాపాన్ని వ్యక్తం చేశాడు.


కళాతపస్వి మరణ వార్త విని దేశ ప్రధాని నుంచి సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రజినీ, కమల్, ఇళయరాజా, అమితాబ్, అనిల్ కపూర్ ఇలా ఇండియన్ సినీ ప్రముఖులంతా తీవ్ర దుఃఖాని లోనవుతూ సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే


Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి