Kalki 2898 AD WW Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ గా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు బద్దలు కొట్టేపనిలో పడ్డాడు. అంతేకాదు హిందీ బెల్ట్ లో ఈ సినిమా వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తుంది. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా హిందీ వెర్షన్ లో నిన్న రెండో ఆదివారం బాక్సాఫీస్ దగ్గర రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 212.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మూవీల తర్వాత హిందీ డబ్బింగ్ వెర్షన్ లో రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసిన సినిమాగా కల్కి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇదే సమయంలో త్వరలో ఆర్ఆర్ఆర్ మూవీ లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు దాదాపు రూ. 12 కోట్ల షేర్ (రూ. 20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల షేర్ (రూ.930 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లోపు ఈ సినిమా రూ. 1000 కోట్ల వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే ఆర్ఆర్ఆర్ మూవీ 11 రోజుల్లో రూ. 923 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అటు KGF 2 11 రోజుల్లో రూ. 882 కోట్ల గ్రాస్.. జవాన్ మూవీ 11 రోజుల్లో రూ. 855 కోట్లు.. యానిమల్ మూవీ 11 రోజుల్లో.. రూ 737 కోట్ల గ్రాస్..  సలార్ మూవీ.. 11 రోజుల్లో రూ. 628 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 5లో ఉన్నాయి.


‘కల్కి’ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్.. ‘భైరవ’ పాత్రలో నటించారు. అటు మహా భారతంలో కర్ణుడి పాత్రలో నటించారు. సెకండ్ పార్ట్ లో కర్ణుడి పాత్రపైనే సినిమా మొత్తం రన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో నటిస్తే.. కమల్ హాసన్.. సుప్రీమ్ యాస్కిన్ గా మెప్పించారు. అటు విజయ్ దేవరకొండ .. అర్జునుడి పాత్రలో కాసేపు అలా అలరించిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా కల్కి 2024లో హైయ్యెస్ట్ గ్రాసర్  మూవీగా నిలిచే అవకాశాలున్నాయి.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి