Ashwini Dutt Kalki 2898 AD: కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జేఎస్పి, బిజెపి.. కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు.. ఇప్పటికే రిజైన్ చేస్తుండగా.. త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నారు అని వార్తలు మొదలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా మొన్న ఎలక్షన్ ఫలితాలు బయటికి రాగానే.. టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి..తన పదవికి.. ఆ రోజు సాయంత్రం  రాజీనామా చేసాడు. దీంతో ఈ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని.. ప్రస్తుతం గట్టిగా వార్తలు వస్తున్నాయి.


టాలీవుడ్ స్టార్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఎన్టీఆర్ ఉన్నప్పటినుంచి.. టిడిపికి ఎంతో స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేవాడు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా.. ఈ నిర్మాత మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని తన అభిప్రాయం ఎటువంటి భయం లేకుండా చెప్పారు. అశ్వినీదత్ టీడీపీ సపోర్ట్ అని పరిశ్రమలో కూడా అందరికి తెలిసిందే. అలానే ఆయనకి నందమూరి కుటుంబంతో చాలా సన్నిహిత్యం ఉంది.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూతమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ..ఖాళీ అయిన టీటీడీ చైర్మన్ పదవి అశ్వినీదత్ కు దక్కబోతోంది అనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో.. ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం తెలియాల్సి ఉంది. 


గతంలో చంద్రబాబు ప్రభుత్వం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్ గా అలానే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే SVBC ఛానల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ కానుందని. అశ్వినీదత్ కు కూడా టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. కాగా అశ్విని దత్ నిర్మిస్తున్న కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ అయినట్టు వినికిడి.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook