Kalyan Ram - NKR: తెలుగు సినీ పరిశ్రమలో జయాపజయాలతో సందబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. బింబిసార మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత అమిగోస్‌లో మూడు విభిన్న పాత్రల్లో మెప్పించారు. డోపర్ గ్యాంగల్ అంటూ తెలుగు తెరకు కొత్త కాన్సెప్ట్‌తో పలకరించినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ తర్వాత 'డెవిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమాకు టాక్‌ బాగున్నా..బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్‌ రామ్.. త్వరలో తన కొత్త చిత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అటు ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ షార్ట్‌లో చేతిలో రుద్రాక్ష మాలతో పిడికిలితో కళ్యాణ్ రామ్ టెర్రిఫిక్‌గా కనిస్తున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ బాబుతో 'సరిలేరే నీకెవ్వరు' తర్వాత విజయశాంతి యాక్ట్ చేస్తోన్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.


ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్‌గా బింబిసార 2 మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వశిష్ఠ కాకుండా మరో దర్శకుడు ఈ సినిమాను టేకప్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 'బింబిసార' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ వెయిట్ చేస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 21వ సినిమా. నటుడిగా 24వ చిత్రం కావడం గమనార్హం.


Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook