నందమూరి కళ్యాణ్ రామ్.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'డెవిల్'. 'బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' ట్యాగ్ లైన్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెవిల్ నుంచి వచ్చిన 'మాయ చేశావే' సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించింది. డెవిల్ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.


నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో ఉపయోగపడింది. సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు.


ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు.


Also Read: Income Tax Filing 2023: ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా..? పూర్తి వివరాలు ఇలా..!


ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ 
న‌టీన‌టులు:  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్త త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


స‌మ‌ర్ప‌ణ‌:  దేవాన్ష్ నామా


బ్యాన‌ర్‌:  అభిషేక్ పిక్చ‌ర్స్‌


డైరెక్టర్, ప్రొడ్యూసర్ :  అభిషేక్ నామా


సీఈఓ : వాసు పోతిని


సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌


క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు:  శ్రీకాంత్ విస్సా


మ్యూజిక్‌:  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌


ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌


ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు


స్టోరి  డెవ‌ల‌ప్‌మెంట్‌:  ప్ర‌శాంత్ బ‌రాడి


కోడైరెక్ట‌ర్‌:  చ‌ల‌సాని రామారావు


పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా


రీరికార్డింగ్ మిక్స్‌:  ఎ.ఎం.ర‌హ్మ‌తుల్లా, ఎం.ర‌హ్మ‌తుల్లా


స్టంట్స్‌:  వెంక‌ట్ మాస్ట‌ర్‌


పోస్ట‌ర్ డిజైన్స్‌:  క‌న్నీ స్టూడియోస్‌


డిజిట‌ల్ మార్కెటింగ్:  వాల్స్ అండ్ ట్రెండ్స్


కాస్ట్యూమ్ డిజైన్స్‌:  అశ్విన్ రాజేష్


Also Read: World Cup 2023: ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్లు వీళ్లే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook