Kamal Haasan Health Update: కమల్ హాసన్‌కు అస్వస్థత.. ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
Kamal Haasan Health Update యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు అస్వస్థత అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఇలా ఆస్పత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Kamal Haasan Health Update లోకనాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జ్వరంతో పాటుగా కాస్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయట. దీంతో చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆస్పత్రిలో ఆయన్ను జాయిన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్.. తన గురువైన కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు.
అలా నిన్న రాత్రికి చెన్నై చేరుకున్న తరువాతే ఇలా జరిగిందని తెలుస్తోంది. రాత్రి కాస్త జ్వరంగా ఉండటం, ఇలా శ్వాస తీసుకోడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లినట్టు సమాచారాం. అయితే ఇప్పుడు కమల్ హాసన్ క్షేమంగా ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కమల్ హాసన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పినట్టు సమాచారం అందుతోంది.
కమల్ హాసన్ ప్రస్తుతం ఎంత ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. విక్రమ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్లను కొల్లగొట్టేశాడు. ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. తనకున్న అప్పులన్నీ తీర్చేశాడు. మళ్లీ భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అయితే కమల్ హాసన్ శంకర్ కలిసి ఇండియన్ 2ని పూర్తి చేసే పనిలో పడ్డారు.
మొన్నామధ్య జరిగిన కమల్ హాసన్ బర్త్ డే పార్టీ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అందులో తన పాటలకే తానే స్టెప్పులు వేశాడు కమల్ హాసన్. రాధిక, కమల్ హాసన్ కలిసి మత్తుగా మత్తుగా అనే పాటకు స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. అలా కోలీవుడ్ మొత్తం కూడా కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో సందడి చేసింది.
Also Read : Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్
Also Read : Faima Mother : ఫైమా, సత్యలు మారతారా?.. తల్లిదండ్రుల మాటలు వింటారా.. పెడచెవిన పెడతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook