Kangana ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపారు. శివసేన నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ ప్రముఖలతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని చూస్తున్నారని పిటీషన్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్( Kangana ranaut) మరో సంచలనానికి తెర లేపారు. ముంబైలో తనపై నమోదైన కేసుల విచారణను సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు( Supreme court)లో పిటీషన్ దాఖలు చేసింది కంగనా రనౌత్. బాలీవుడ్ ప్రముఖులతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో తెలిపింది. ముంబైలోనే విచారణ జరిగితే..ప్రాణాలకే ముప్పుందని..శివసేన నేతలు రాజకీయ కక్షతో తమకు హాని తలపెడతారని పేర్కొంది. తన ప్రాణాలకు ముప్పుందన్న కారణంతోనే కేంద్ర హోంశాఖ( Union home ministry) ఇటీవల తనకు వై ప్లస్ కేటగరీ భద్రత కల్పించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. 


మరోవైపు కంగనా రనౌత్( Kangana Ranaut)తన ట్వీట్లు, వ్యాఖ్యలతో హిందూ-ముస్లిం సఖ్యత చెడిపోయేలా వ్యవహరించాలని న్యాయవాది అలి కసీఫ్ ఖాన్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. సుశాంత్ సింగ్ మరణానంతరం రిపబ్లిక్ టీవీలో కంగనా రనౌత్ తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యానించారంటూ ప్రముఖ పాటల రచయిత జావేద్ అఖ్తర్ కూడా కంగనాపై కేసు వేశారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా  కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌లు వ్యవహరించాలని క్యాస్టింగ్ డైరెక్టర్ మునవ్వర్ అలీ సయ్యద్ కూడా దేశద్రోహం కేసు వేశారు. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కంగనా రనౌత్..కోరుకున్నట్టు సొంత రాష్ట్రానికి కేసులు బదిలీ అవుతాయా లేదా చూడాలి మరి. 


Also read: Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr !


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook