Jayashree death mystery: కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో మాజీ కంటెస్టంట్ జయశ్రీ రామయ్య సోమవారం (జనవరి 25) మధ్యాహ్నం తన నివాసంలో శవమై కనిపించింది. ఆదివారం రాత్రే నటి తన నివాసంలో ఉరివేసుకున్నట్లు తెలిసింది. శాండల్‌వుడ్ మీడియా అప్‌డేట్స్ ప్రకారం, డిప్రెషన్‌తో పోరాడుతున్న జయశ్రీ రామయ్య ఆదివారం అర్థరాత్రే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. జయశ్రీ అకాల, అసహజ మరణం ( Jayashree's unnatural death ) కన్నడ సినీ పరిశ్రమను షాక్‌కి గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Kangana Ranaut: ఆ డ్రెస్ కొనడానికి డబ్బుల్లేవు, కంగనా సంచలన విషయాలు


జయశ్రీ రామయ్య డిప్రెషన్‌తో పోరాటం చేస్తున్నప్పటి నుండే ఆమె మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. జూలై 22, 2020న ఉదయం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన జయశ్రీ రామయ్య.. "ఈ ప్రపంచానికి, డిప్రెషన్‌కి వీడ్కోలు, ఇక తాను నిష్క్రమిస్తున్నాను'' అని అందులో పేర్కొన్నారు. అప్పట్లో జయశ్రీ ఫేస్ బుక్ పోస్ట్ కన్నడ సినీ పరిశ్రమలో ( Kannada film industry ) పెను సంచలనం సృష్టించింది. దీంతో జయశ్రీ వెంటనే తన పోస్ట్‌ను తొలగించి, "ఐ యామ్ ఆల్రైట్ అండ్ సేఫ్ ! మీ అందరినీ ప్రేమిస్తున్నాను" అని మరో కొత్త అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా జయశ్రీ ఆత్మహత్య ( Jayashree Ramaiah suicide ) నేపథ్యంలో ఆమె అభిమానులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook