Sandalwood, Mangaluru Drugs Case: బెంగళూరు: సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు (Drugs Case) వణికిస్తోంది. బాలీవుడ్‌తోపాటు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ తరహాలోనే శాండల్‌వుడ్‌లో కూడా డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజగా శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు ప్రముఖ కన్నడ ప్రముఖ యాంకర్ అనుశ్రీ (Kannada TV anchor Anushree) కి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బెంగళూరులో గురువారం అనుశ్రీ పేర్కొంది. దీంతో స్పందించిన అధికారులు అనుశ్రీకి గురువారం రాత్రి వ్యక్తిగతంగా నోటీసులు అందించారు. అంతేకాకుండా శుక్రవారం విచారణకు హాజరుకావాలని సూచించారు. Also read: Salman Khan About SP Balu: ఎస్పీ బాలు సార్.. మీ పాటలు నాకెంతో ప్రత్యేకం: సల్మాన్ ఖాన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. డ్రగ్స్ రవాణాకు సంబంధించి ఏబీసీడీ (ABCD) సినిమా నటుడు, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కిషోర్ శెట్టిని పోలీసులు సెప్టెంబర్ 19న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో కిషోర్ శెట్టి పలు కీలక ఆధారాలను వెల్లడించినట్లు సమాచారం. గతంలో జరిగిన పలు పార్టీలో అనుశ్రీ డ్రగ్స్ తీసుకునేదని.. పార్టీలకు తరచూ హాజరయ్యేదని కిషోర్ వెల్లడించడంతోనే.. అనుశ్రీకి నోటీసులు అందజేసినట్లు సమాచారం. Also read : SP Balu health bulletin: మరింత క్షీణించిన బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల


శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో.. అంతకుముందు హీరోయిన్లు రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) , సంజనా గల్రానీ (Sanjjana Garlani) అరెస్ట్ అయ్యారు. వారు అరెస్టయిన తర్వాత విచారణలో చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. వారి అరెస్ట్ తర్వాత.. కోరియాగ్రాఫర్ కిషోర్ శెట్టి, అతని సహాయకుడు అకిల్ నౌషీల్, స్పా సిబ్బంది అస్కాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఈ కేసులో ప్రముఖ నటి ఐంద్రితా రై, ఆమె భర్త, నటుడు దిగంత్‌కు కూడా అధికారులు నోటీసులు జారీచేశారు.  Also read: Sandalwood Drug Case: నటి సంజన అరెస్ట్