Karthikeya 2 Likely to postpone one more day: కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. హైదరాబద్ నవాబ్స్ అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు మొదటి హిట్ మాత్రం హ్యాపీ డేస్ సినిమానే. యువత, స్వామి రారా, కేశవ, అర్జున్ సురవరం, కార్తికేయ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా వంటి సినిమాలతో నిఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిఖిల్ కెరీర్‌లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో 'కార్తికేయ' ఒకటి. చానాళ్ల ర్వాత డైరెక్టర్ చందు మొండేటి, హీరో నిఖిల్ కలిసి ఆ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' సినిమాను సిద్ధం చేశారు. కార్తికేయ 2 అనౌన్స్ మెంట్ పోస్టర్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచగా ఆ తరువాత సినిమా నుంచి విడుదలైన దాదాపు ప్రమోషనల్ స్టఫ్ అంతా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సినిమా మీద మంచి ఆసక్తి పెంచింది. నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది.


టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 సినిమాను జూలై 22న  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. ఆ తరువాత సినిమాను ఆగస్టు 12కి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే తన సినిమాను వాయిదా పడేలా చేస్తున్నారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు, తాను ఏడ్చిన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు. అయితే ఇప్పుడు మరోమారు సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.


ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న కార్తికేయ 2 మూవీలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్య మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కథనం అంతా శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, ద్వాపర యుగాలకు చెందినదిగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే.. ఈ సినిమాపై హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను కూడా ప్రముఖ మీడియా గ్రూప్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ మళ్ళీ వాయిదా పడుతున్న క్రమంలో వారంతా నిరాశలో కూరుకుపోయారు. 


Also Read: Bindu Madhavi: అలాంటిది నాకు వద్దు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధు మాధవి!


Also Read: Rukshar Dhillon Pics: రుక్షర్ థిల్లాన్ వెరీ హాట్ గురూ.. థైస్ షో మాములుగా లేదుగా!


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook