Kartik Aaryan's Marriage: బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటాడు. ఈ కథానాయకుడికి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఓ క్యూట్‌ వీడియో షేర్‌ చేశాడు కార్తీక్‌. ఈ వీడియోలో అర్జున్‌ పాతక్‌ అనే అమ్మాయి 'ధమాకా' సినిమాలోని డైలాగులను చెప్తోంది. అనంతరం వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్‌ అయితే 'రూ.20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్‌ ఆర్యన్‌ రిప్లై ఇస్తూ.. 'సరే, ఎప్పుడు చేసుకుందాం?' అని అడిగాడు. దానికి ఆమె 'వచ్చేసేయ్‌, ఇప్పుడే చేసుకుందాం' అని జవాబిచ్చింది. 



ఈ పోస్ట్  చూసిన మరికొంతమంది అమ్మాయిలు.. 'నేనూ ఇస్తా 20 కోట్ల రూపాయలు, నన్ను పెళ్లి చేసుకో' అంటూ హీరోకు కామెంట్లు పెడుతున్నారు. దీంతో కార్తీక్‌ ఆర్యన్‌ 'వేలంపాట వేద్దామా?' అంటూ కామెంట్ పెట్టాడు. గతేడాది కార్తీక్‌ ఆర్యన్‌ 'ధమాకా' (Dhamaka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతడు 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌ 'షెహజాదా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల చేయాలని మేకర్స ఆలోచిస్తున్నారు. అలాగే 'భూల్‌ భులాయా 2', 'ఫ్రెడ్డీ' సినిమాలు కూడా త్వరలో రిలీజ్ కానున్నాయి. 


Also Read: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook