Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?

Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'.. శుక్రవారం (మార్చి 11) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 08:27 PM IST
Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?

Radhe Shyam Movie: ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాధేశ్యామ్'. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 11) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విదేశాల్లో ప్రివ్యూ షో ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రకారం సినిమా 1970ల నాటి కథకు సంబంధించినదని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికా (పామ్ రీడర్) నిపుణుడిగా నటించాడు. 

భారీ ఓపెనింగ్స్!

సినిమా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 7 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. 'బాహుబలి' సిరీస్, 'సాహో' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాధేశ్యామ్' కావడం వల్ల ఈ సినిమాపై ఫ్యాన్స్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'సాహో' చిత్రం దక్షిణాదిలో హిట్ టాక్ తెచ్చుకోకపోయినా.. అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తథ్యమని సినీ పండితులు అంటున్నారు. 

సంక్రాంతి సందర్భంగా (జనవరి 14) విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. జనవరి తర్వాత కరోనా కేసులు దేశవ్యాప్తంగా నియంత్రణలోకి రావడం వల్ల ఉత్తర భారతదేశంలోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో మార్చి 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. 

ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించగా.. సచిన్ ఖేడేకర్, సత్యరాజ్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ తదితరులు నటించారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. 

Also Read: Janhvi Kapoor Photos: కంటి చూపుతో చంపేయడమంటే ఇదేనేమో బాల!

Also Read: RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ షురూ.. సినిమాలోని స్పెషల్ సాంగ్ తో అభిమానులకు సర్ ప్రైజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News