Keerthy Suresh Anthony: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న కీర్తి సురేష్,  నేను శైలజ సినిమా ద్వారా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది.ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక నాచురల్ స్టార్ నానితో దసరా సినిమా చేసి బెస్ట్ హీరోయిన్ క్యాటగిరిలో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఎప్పుడు వివాహం చేసుకుంటుందని అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. 


ఎట్టకేలకు తను చిన్ననాటి స్నేహితుడితో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు రాగా.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు కీర్తి సురేష్. తాను ఆంటోనీని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 


15 సంవత్సరాలుగా మేము ప్రేమలో ఉన్నాము అంటూ AntoNY x KEerthy(lykyk)'తన కాబోయే భర్తతో దిగిన ఫోటోని షేర్ చేసింది. మొత్తానికైతే తన కాబోయే భర్తను పరిచయం చేసి రూమర్స్ ను నిజం చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది..


 



ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. పలు చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె  ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచేసి , మరింతగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే మేనక కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు చిత్రాలలో నటించి అలరించింది.


ఇకపోతే కీర్తి సురేష్ తండ్రి ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ నిర్మాత జి సురేష్. ఇక ఇప్పుడు బడా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పుడు స్టార్ స్టేటస్ అందుకొని దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.


Read more: Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.