Keerthy Suresh Hot Photos: మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మూలాలు ఉన్న తండ్రికి తమిళ మూలాలను తల్లికి నట వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగులో నేను శైలజ అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది. రామ్ సరసన హీరోయిన్గా నటించిన ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత నాని సరసన నేను లోకల్ తో కూడా హిట్ కొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎప్పుడైతే మహానటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో ఈ భామకు ప్రేక్షకులు పట్టం కట్టేశారు. సావిత్ర పాత్రలో నటించిన ఈ భామ నటించమంటే జీవించేసి ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయింది. అయితే యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో తెలియదు కానీ మహానటి సినిమా తర్వాత దాదాపుగా ఆమె చేస్తున్న సినిమాలు ఏవీ హిట్ టాక్ తెచ్చుకోవడం లేదు. ఆమె అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.


అలాగే సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమాలన్నీ ఆమెకు వరుస డిజాస్టర్లుగా మారాయి. ఈ నేపద్యంలో కీర్తి సురేష్ ప్రస్తుతానికి చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర అనే సినిమా చేస్తోంది. అలాగే నానీ సరసన దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఆమె బోల్డ్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ఎద అందాల ఆరబోసే విధంగా ఒక ఫ్రాక్ లో ఫోటోషూట్ షేర్ చేయగా ఇప్పుడు తాజాగా స్లీవ్ లెస్ టాప్ ఒకదాని ధరించి అందులో కిల్లర్ లుక్ లో కవ్విస్తోంది మహానటి.


ఎలా అయినా తెలుగు సహా దక్షిణాది భాషల్లో మంచి ఆఫర్లు పట్టాలని చూస్తున్న ఈ భామ ఇకమీదట వరుస హాట్ ఫోటోషూట్లు విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. మరి మహానటి ఇంత కష్టపడుతుంటే మన దర్శక నిర్మాతలు ఆమెకి ఏమైనా అవకాశాలు ఇస్తారో లేదో కూడా చూడాల్సి ఉంది. ఒకరకంగా ఆమె ట్రాక్ రికార్డు చూస్తే మహానటి తర్వాత సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా ఒకటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక అందాలు ఆరబోయక తప్పదు అని కీర్తి సురేష్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 
Also Read: Rakul Preet Singh: ట్రాన్స్ పరెంట్ డ్రెస్లో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్.. మాములు రచ్చ కాదుగా ఇది!
Also Read: Shalini Pandey: బ్లాక్ అవుట్ ఫిట్లో షాలిని పాండే మెరుపులు.. చక్కనమ్మ చిక్కినా అందమే మరి!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.