Keerthy Suresh To Marry A politician Soon: నేను శైలజ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సరే కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి మహానటి సినిమాతో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాయి. మహానటి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె దాదాపు ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ సినిమాలతో డిజాస్టర్ ఫలితాలు అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇలా వర్కౌట్ కాదు అనుకుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆమె హీరోలతో గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. అలాగే సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ రోల్స్ చేసి అందరితో ఔరా అనిపించుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు రంగం సిద్ధమైంది అనే ప్రచారం జరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు అరేంజ్ మ్యారేజ్ ప్లాన్ చేశారని, ఈ క్రమంలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.


ఆమె కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తి ఒక వ్యాపారవేత్త అని అలాగే దక్షిణాదిలో పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇదే వార్త గత కొన్నాళ్ల క్రితం కూడా వెలుగులోకి వచ్చింది. కానీ ఆమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటికీ వెలువడ లేదు. అయితే పెళ్లి వార్తలుపై కీర్తి సురేష్ స్పందించకపోవడంతో అవి నిజమేనేమో అని అభిమానులు కూడా భావిస్తున్నారు.


ప్రస్తుతానికి కీర్తి సురేష్ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమాలో ఆయనకు సోదరి పాత్రలో నటిస్తోంది.


Also Read: Rashmika Mandanna: దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక..రెమ్యునరేషన్‌ తెలుస్తే అంతా షాకే..!


Also Read: Bimbisara: దుమ్మురేపిన బింబిసార.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువగా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?\



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook