Bimbisara: దుమ్మురేపిన బింబిసార.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువగా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Bimbisara Day 2 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 02:30 PM IST
Bimbisara: దుమ్మురేపిన బింబిసార.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువగా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Bimbisara Day 2 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు వెళుతోంది. కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమా రెండో రోజు కూడా సత్తా చాటింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి నాలుగున్నర కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రోజుల కలెక్షన్లు 10 కోట్ల 80 లక్షలకు చేరాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రెండూ కలిపి 13 కోట్ల రూపాయలకు అమ్ముడైతే రెండు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్ల 80 లక్షలు సాధించడంతో మూడోరోజు కచ్చితంగా ప్రాఫిట్ జోన్ లోకి సినిమా ఎంటర్ అవ్వడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు ఈ సినిమా 12.37 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 16.20 కోట్లు బ్రేక్ ఈవెన్ గా నిర్ణయించారు. ఇప్పటికే 12.37 కోట్లు రాబట్టడంలో మరో 3.83 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ చేసినట్టే.

మూడో రోజు ఆదివారం కావడంతో పాటు హౌస్ ఫుల్ బోర్డులు చాలా చోట్ల కనిపిస్తూ ఉండడంతో కళ్యాణ్ రామ్ సినిమా ఆయన కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి భాగం సక్సెస్ అయితే సినిమాకు సీక్వెల్ కూడా చేస్తామని ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ వెల్లడించింది. సినిమా చివరిలో అందుకు ఒక హింట్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా వరీనా హుస్సేన్ ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఇక ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Also Read: Poorna:మొన్నే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా.. పెళ్లి విషయంలో పూర్ణ సంచలన నిర్ణయం?

Also Read: Hero Nani Escaped from Accident: హీరో నానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బొగ్గు గనిలో ఊహించని విధంగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News