KGF Chapter 2 movie becomes 2nd highest grosser worldwide in weekend Collections: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యష్ హీరోగా నటించిన చిత్రం 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2' బ్లాక్‌బస్టర్‌ హిట్ సొంతం చేసుకుని మంచి రన్‌తో దూసుకుపోతోంది. ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌ 2 మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాఖీ భాయ్ వయోలెన్స్‌కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. రాఖీ భాయ్ గత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 రికార్డుల్లో నిలిచింది. ఓ నివేదిక ప్రకారం గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో ఏప్రిల్‌ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్‌ రెండవ స్థానంలో ఉంది. 'ఫెంటాస్టిక్ బీస్ట్స్ 3' మాత్రమే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కంటే ముందుంది. మరోవైపు కేజీఎఫ్‌ 2 రూ. 500 కోట్ల క్లబ్బులో చేరింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ. 551.83 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి.


కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమా మొదటి రోజు (ఏప్రిల్ 14)న 165.37 కోట్లు వసూల్ చేసింది. రెండో రోజు 139.25 కోట్లు కొల్లగొట్టగా.. మూడో రోజు 115.08 కోట్లు వసూల్ చేసింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో 132.13 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో కేజీఎఫ్‌ 2 551.83 కోట్లు వసూల్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి. 



కేజీఎఫ్ 2 హిందీలో కూడా కొత్త చరిత్ర సృష్టించింది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్లో 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. 200 కోట్ల రికార్డును అందుకోవడానికి బాహుబలి 2 మూవీకి 6 రోజులు పడితే.. కేజీఎఫ్ 2కి ఐదు రోజులు పట్టింది. కేజీఎఫ్ 2 చిత్రం గురువారం రూ. 53.95, శుక్రవారం రూ. 46.79, శనివారం రూ. 42.90, ఆదివారం రూ. 50.35 రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.193.99 కోట్లు వసూల్ చేసింది. ఈరోజు ఉదయం 200ల క్లబ్‌లో చేరింది.  


Also Read: Ravindra Jadeja: నీ అమ్మ అంటూ.. కోపంతో ఊగిపోయిన రవీంద్ర జ‌డేజా (వీడియో)!


Also Read: Laptop Blast in AP: పనిచేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి తీవ్ర గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook