KGF 2 Dialogues: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్'. కొన్నేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ మూవీలోని రాకీ భాయ్ పాత్రకు ఎంతో మంది అభిమానులుగా మారారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సీక్వెల్ 'కేజీఎఫ్ 2' విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమోషన్స్ లో భాగంగా 'కేజీఎఫ్ 2' సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. హీరో యష్ చెప్పిన డైలాగ్.. "వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్, వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్" అందర్ని ఆకట్టుకుంటోంది. 


అయితే ఇటీవలే జరిగిన 'కేజీఎఫ్ 2' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సీక్రెట్ చెప్పారు. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'కేజీఎఫ్' మూవీ డైలాగ్స్ ను ఓ స్టార్ హీరో రాశారంట. ఆయన ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో యష్. సినిమాలో ఆయన పోషించిన పాత్ర రాకీ భాయ్ కు ఆయనే సగం డైలాగ్స్ రాసుకున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు.  



Also Read: Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!


Also Read: RRR Movie Collections: ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook