RRR Movie Collections: ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

RRR Movie Collections: రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శనమవుతుంది. ఇప్పుటికే విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 611 కోట్ల కలెక్షన్స్ సాధించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 12:25 PM IST
RRR Movie Collections: ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

RRR Movie Collections: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం). ఇటీవలే (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన అనేక కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించడం సహా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను కొల్లగొడుతోందీ చిత్రం. ఇటీవలే హిందీ వర్షెన్ లో వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. 

ఆరు రోజుల్లో రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించినట్లు మూవీ ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆరు రోజులుగా ఆర్ఆర్ఆర్ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం

నైజాం (తెలంగాణ) ప్రాంతంలో రూ. 74 కోట్లు కలెక్ట్ చేయగా.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 37 కోట్లు.. మరోవైపు ఉత్తరాంధ్రలో రూ. 22 కోట్లు, గోదావరి జిల్లాల్లో రూ. 16 కోట్లు, గుంటూరులో రూ. 15 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 13 కోట్లు, నెల్లూరు రూ. 8 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి రూ. 180 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. రూ. 270 కోట్ల వరకు గ్రాస్ సొంతం చేసుకుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన ఆరు రోజుల్లో రూ. 611 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. వీరి సరసన ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయకులుగా వ్యవహరించారు. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలను సమకూర్చారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్ లో విడుదల చేశారు. డాల్బీ ఫార్మాట్ లో రిలీజ్ అయిన తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు సృష్టించింది.  

Also Read: Priyanka Arul Mohan Photos: పూల మధ్యలో చందమామలా మెరిపోతున్న 'గ్యాంగ్ లీడర్' భామ!

Also Read: Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News