Yash19: ఫైనల్ గా వచ్చేసినా యశ్ తదుపరి ప్రాజెక్ట్ అప్డేట్.. టైటిల్ అనౌన్స్ అప్పుడే..
Yash: కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హీరో అయిపోయారు యాష్. కానీ ఆ సినిమా విడుదల అయ్యి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఈ హీరో తదుపరి సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఫైనల్ గా ఈరోజు యాష్ 19వ సినిమా గురించి అప్డేట్ రావడంతో ఆయన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు..
KGF Yash: కేజిఎఫ్ సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాష్ హీరోగా నటించాడు. ఈ చిత్రంతో ఈ కన్నడ హీరో కాస్త పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కాగా కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యి దాదాపు సంవత్సరం పైన కావస్తున్న ఇంకా ఈ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ పైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు తెగ నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్ని రోజులకు ఈ హీరో తదుపరి ప్రాజెక్టు గురించి అప్డేట్ వచ్చేసింది. కే జి ఎఫ్ రెండో భాగం ఈయన 18వ సినిమా కాగా.. ఈ హీరో కెరియర్ లో రాబోతున్న 19వ సినిమా గురించి వివరాలు ఎప్పుడు వస్తాయని అభిమానులు తెగ ఎదురు చూశారు. ఈ విషయం గురించి యశ్ కూడా మధ్యలో ఓ సారి బదులిస్తూ.. ‘ఎదురు చూస్తూ ఉండండి. క్రేజీ అప్డేట్ త్వరలోనే ఇచ్చేస్తాను’ అని చెప్పాడు. ఇక ఈ మధ్య మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యశ్ 19 సినిమాని డైరెక్ట్ చేయబోతోందని వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని తాజాగా యశ్ 19 సినిమా అప్డేట్ మాత్రం వచ్చింది.
అది కూడా ఈ హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో తన తదుపరి సినిమా అప్డేట్ అఫీషియల్ గా ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో యశ్ తన 19వ సినిమాని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. అయితే ఈ సినిమా టైటిల్ ని మాత్రం డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అప్పుడే సినిమా డైరెక్టర్ ని కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో యశ్ అభిమానులు ఈ సినిమా ప్రకటన కోసం, అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సారి యశ్ ఎలాంటి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటారో తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.
Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి