Director Pradeep Raj Passes Away: కరోనా మహమ్మారి కన్నడ సినీ దర్శకుడు ప్రదీప్ రాజ్‌(46)ను బలితీసుకుంది. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన పాండిచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం (జనవరి 20) తెల్లవారుజామున కన్నుమూశారు. పాండిచ్చేరిలోనే ప్రదీప్ రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రదీప్ రాజ్ (Pradeep Raj) మృతిపై కన్నడ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 15 ఏళ్లుగా ప్రదీప్ రాజ్ డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కరోనా తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాల పనితీరు దెబ్బతినడంతో ప్రదీప్ రాజ్ మరణించారు. ప్రదీప్ రాజ్ మృతిపై స్టార్ హీరో యష్ సహా పలువురు నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.


ప్రదీప్ రాజ్ హీరో యష్‌తో (KGF Yash) తెరకెక్కించిన 'కిరాతక' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ 3వేల సినిమాల మార్క్‌ని చేరింది. ఈ సినిమాలో యష్ పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. అందుకే యష్‌కి ప్రదీప్ రాజ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. 2018లో రాగిణి ద్వివేది, సాయి కుమార్‌లతో ప్రదీప్ రాజ్ తెరకెక్కించిన 'కిచ్చు' సినిమా కూడా మంచి హిట్ అందుకుంది.


రజనీకాంత, మిస్టర్ 420, బెంగళూరు 560023 తదితర చిత్రాలను ప్రదీప్ రాజ్ తెరకెక్కించారు. కాగా, గత రెండేళ్లుగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి (Covid 19 Cases) ఇప్పటికే పలువురు నటీనటులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.


Also Read: Sam-Chai divorce: సమంత, నాగచైతన్య మళ్లీ ఒక్కటవుతున్నారా.. అందుకే సామ్ అలా చేసిందా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook