Kiara Advani And Sidharth Malhotra Wedding Date బాలీవుడ్‌లో గత ఏడాది నుంచి ప్రేమ జంటలన్నీ కూడా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నాయి. అలియా రణ్‌బీర్, కత్రినా విక్కీ కౌశల్ ఇలా చాలానే జంటలు వివాహాం చేసుకున్నాయి. హ్యాపీగా వారి వారి జీవితాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో అలియా అయితే అప్పుడే తల్లి కూడా అయిపోయింది. ఇక కత్రినా వంతు ఉంది. ఇప్పుడు మరో యంగ్ జోడి పెళ్లికి సిద్దమైనట్టు సమాచారం అందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వాణిల ప్రేమ కథలు బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్తుంటారు. బాలీవుడ్‌ సెలెబ్రిటీల ఇంట్లో జరిగే ప్రైవేట్ వేడుకలకు జంటగా వెళ్తుంటారు. వీరిద్దరూ కలిసి చేసిన షేర్షా సినిమా కూడా బాగానే హిట్ అయింది. అంతకు ముందు చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా ఈ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి వ్యవహారం నడుస్తోందట.


అయితే ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయట. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని కోటలో ఫిబ్రవరి 6న పెళ్లి జరుగుతుందట. అయితే అంతకంటే ముందుగా ఫిబ్రవరి 4, 5న హల్దీ, సంగీత్ వేడుకలు దుబాయ్‌లో జరుగుతాయట. కుటుంబ సభ్యులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్టు సమాచారం. ఇక బాలీవుడ్ సెలెబ్రిటీల కోసం ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారట.


మొత్తానికి వీరిద్దరు మాత్రం ఇంకా ఏ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. కియారా తెలుగు వారిని వినయ విధేయ రామ, భరత్ అనే నేను వంటి సినిమాలతో పలకరించింది. ఇప్పుడు రామ్ చరణ్‌ శంకర్ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయింది. కియారాకు బాలీవుడ్‌లోనే ఎక్కువగా క్రేజీ ప్రాజెక్టులు వస్తుంటాయి.


Also Read:  Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్


Also Read: Aha Twitter DP : దెబ్బకు డీపి కూడా మార్చేశారు.. పవన్ కళ్యాణ్‌ కోసం ఆహా అనేలా ప్రమోషన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook