Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (UstaadBhagatSingh). హరీష్‌ శంకర్‌ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గబ్బర్‌ సింగ్‌ తర్వాత హారీశ్ శంకర్-పవన్ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ పార్ధీబన్‌ (R. Parthiban) విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో పవన్ జోడిగా శ్రీలీల నటిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు పవన్ కల్యాణ్ సుజిత్ డైరెక్షన్‌లో 'ఓజీ'లో నటిస్తున్నాడు. రీసెంట్ గా పవన్‌ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రచార చిత్రం  ఓ రేంజ్‌లో నెట్టింట ట్రెండ్ అయింది.  గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  పవన్ స్వాగ్ అండ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా రేంజ్ ల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‍గా,  బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. విలన్‍గా నటిస్తున్నాడు. తమిళ యాక్టర్లు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ తెరకెక్కబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‍లోగా ఓజీ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇంకోవైపు క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 


Also Read: Eagle Movie: మొండోడు పండుగకు వస్తున్నాడు.. ఈగల్ రిలీజ్ డేట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook