Nikesha Patel-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వైజాగ్‌కు రావడంతో అక్కడి కార్యక్రమంలో ఎలాంటి మలుపులు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. అధికార పార్టీ కూడా అదే సమయంలో అక్కడ కార్యక్రమాలు చేయడం, పవన్ కళ్యాణ్‌ కూడా రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ మంత్రుల కార్లు ధ్వంసం అయ్యారు. ఎయిర్‌పోర్టులో నానా హంగామా జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ రాకతో వైజాగ్ మొత్తం చీకటి మయం అయింది.కరెంటు లేకపోయినా కూడా సెల్ ఫోన్ల లైట్లతోనే పవన్ కళ్యాణ్ తన జన సైనికులతో ర్యాలీ నిర్వహించారు. మొత్తానికి గర్జన వర్సెస్ జనవాణి అన్నట్టుగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల లాఠీ చార్జ్‌ల మధ్యనే ర్యాలీ నడిచింది. ఇక పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్‌ చుట్టూ పోలీసులు మోహరించారు. పవన్ కళ్యాణ్‌ను గృహ నిర్భందం చేశారు. ఎలాంటి సభలు నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు. మీటింగ్‌లు కూడా పెట్టొద్దని సూచించారు. దీంతో పోలీసులు, ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చురకలు అంటించాడు. కనీసం నేను స్వచ్చమైన గాలిని పీల్చుకునేందుకు సాయంత్రం పూట అలా ఆర్కే బీచ్‌లో వాకింగ్‌కు అయినా వెళ్లొచ్చా? లేదా? అని కౌంటర్లు వేశాడు.


 



పవన్ కళ్యాణ్‌ వేసిన ఈ ట్వీట్ మీద కొమురం పులి హీరోయిన్ నిఖిషా పటేల్ స్పందించింది. నేనూ నీ వెంట నడుస్తా అని స్పందించింది. ఇలా నిఖిషా పటేల్ స్పందించడం, తన మద్దతు ప్రకటించడంతో జన సైనికులు ఆమెకు థాంక్స్ చెబుతున్నారు. అప్పుడెప్పుడో సినిమాలో నటించినా కూడా మీరు ఆ స్నేహాన్ని చూపిస్తున్నారు.. థాంక్స్ మేడం అంటూ జన సైనికులు ట్వీట్లు పెడుతున్నారు.


అయితే తనను ఇప్పటికీ కొమురం పులి హీరోయిన్, పవన్ కళ్యాణ్‌ హీరోయిన్ అని అంటుంటారని ఆ మధ్య నిఖిషా పటేల్ కాస్త హర్ట్ అయింది. గతంలో ఆమె చేసిన లైవ్ చాట్, అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవి, మిగతా స్టార్ హీరోల గురించి చెప్పిన తీరుకు, పొగిడిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.


Also Read : Kantara vs Godfather : కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ గూటికి


Also Read : Janhvi Kapoor Pics : బిగించేసిన జాన్వీ కపూర్.. అందాల అల్లకల్లోలం.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook