Naga Chaitanya Fire On Konda Surekha: తమ విడాకులపై రాజకీయాల్లోకి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ వ్యాఖ్యలు సరైనవి కాదని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌


 


'మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. మా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు అంగీకారం కాదు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను హెడ్‌లైన్స్‌ కోసం ఉపయోగించుకోవద్దు' అని హితవు పలికారు.

Also Read: Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్‌ సమంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌


 


నాగచైతన్యతో విడాకులకు కేటీఆర్‌ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమంత ఖండించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని.. విడాకులు అనేవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవని స్పష్టం చేశారు. నాపై ఇలాంటి వార్తలు రావడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖపై మండిపడుతూ తన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. మీ రాజకీయాల కోసం మా లాంటి వ్యక్తుల జీవితాలను లాగరాదని హితవు పలికారు. ఒక మంత్రిగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.


'గ్లామర్ ప్రపంచంలో ఒక మహిళగా నిలబడడం ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో ప్రేమలో పడడం.. దాని నుంచి బయటకు రావడమైనా తర్వాత గట్టిగా నిలబడి పోరాటం చేయడం అంత సులభం కాదు. దీనికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ. ఇప్పటిదాకా జరిగిన నా ప్రయాణం పట్ల నేను గర్వంగా ఉన్నా' అని సమంత పేర్కొన్నారు.


'పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి దూరంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమే కాక అత్యంత దారుణమైన వ్యాఖ్యలు. ఇవి ఏమాత్రం సహించరానివి. మహిళలకు మద్దతుగా నిలవాలి.. గౌరవింపబడాలి. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను అడ్వాంటేజీగా తీసుకుని మీడియాలో హైలెట్‌ కావాలని చూడడం పూర్తిగా సిగ్గుపడాల్సిన విషయం' అంటూ నాగ చైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


కాగా మంత్రి సురేఖ చేసిన జుగుప్సకరమైన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగచైతన్య మాజీ భార్య సమంత స్పందించి తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో అక్కినేని కుటుంబమంతా ఒక్కటిగా నిలిచింది. తమ కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ముక్తకంఠంతో ఖండించింది. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ సుశీల, సుశాంత్‌ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబం న్యాయ పోరాటం కూడా చేసే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter