Koratala Siva in pressure to impress NTR with script changes: దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు దారుణమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిజానికి ఆయన జీవితాన్ని చూస్తే ఆచార్య ముందు ఆచార్య తర్వాత అనేలా ఆయన పరిస్థితి మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ఇప్పుడు కొరటాల శివ తాను చేయబోతున్న ఎన్టీఆర్ సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమిటంటే నిజానికి ఎన్టీఆర్ కొరటాల శివతో కంటే ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో శ్రీనివాస్ చేయాల్సి ఉంది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లి కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత ఎలా అయినా హిట్ కొట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చేసిన వెంటనే ఆచార్య సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకొని రాజమౌళి సెంటిమెంట్ నిజమే అని నిరూపించాడు.


ఇప్పుడు ఆ బాధ్యత ఎన్టీఆర్ మీద పడింది. ఎలా అయినా కొరటాల సినిమాతో హిట్టు కొట్టి రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత సినిమా డిజాస్టర్ ఖాయం అని సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి అయిన ప్రయత్నిస్తున్నాడు. ఈ దెబ్బతో కొరటాల శివ మీద చాలా ఒత్తిడి ఏర్పడిందని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా స్టోరీ విషయంలో ఎన్టీఆర్ సూచనలు సలహాలు ఇస్తున్నారట. ఆ దెబ్బతో ఇప్పటికే కొరటాల శివ కథను చాలా సార్లు మార్చాడు, కానీ ఆ వెర్షన్స్ ఏవీ ఎన్టీఆర్ను మెప్పించ లేవని తెలుస్తోంది.


దీంతో ఆయన మళ్లీ మళ్లీ కథ వెర్షన్స్ మార్పులు చేస్తూ ఎన్టీఆర్ వద్దకు వెళ్లడం ఎన్టీఆర్ ఇంకా ఇంకా మార్చాలని సూచించడంతో ఆయన చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక రకంగా ఎన్టీఆర్ ముందుకు కథ తీసుకు వెళ్లాలంటే కొరటాల శివ వణికి పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్టీఆర్ కూడా కథ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది అని అంటున్నారు.


నిజానికి ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఇద్దరూ నిర్మించాల్సి ఉంది. దీంతో సొంత నిర్మాతలే కాబట్టి కాస్త ఆగి అయినా సరే మంచి కథతోనే సినిమాతో ముందుకు వెళదామని ఎన్టీఆర్ అనుకుంటుంటూ, ఆగి వెళదాం అనే మాటతో కొరటాల శివ ఇంకా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.


ఈ సినిమా కోసం మొట్టమొదటి సారి ఎన్టీఆర్ - అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్లో మ్యూజిక్ సెట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఒక మోషన్ పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో సినిమా విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అని తెలియక సినిమా యూనిట్ టెన్షన్ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.


Also Read: Anchor Lasya Pregnancy: మళ్లీ తల్లవుతున్నా అంటూ అభిమానులకు లాస్య గుడ్ న్యూస్


Also Read: Gautham Menon Counter: తెలుగు యాంకర్ ను ఆడుకున్న గౌతమ్ మీనన్..డౌట్ రాకుండా సీరియస్ కౌంటర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.