Krishna Vamsi Rangamarthanda : `రంగమార్తాండ`కు స్టాండింగ్ ఓవియేషన్!
Rangamarthanda talk కృష్ణవంశీ తీసే సినిమాలు ఎంత పొయెటిక్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రేమను చూపించినా కోపాన్ని ప్రదర్శించినా కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. రంగమార్తాండ సినిమాను సినీ ప్రముఖులు చూసి ఫిదా అయ్యారట.
Rangamarthanda talk క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతుంటాయి. ఆయన తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా కూడా జనాలకు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రాలుగానే ఉంటాయి. అలాంటి దర్శకుడు తన కెరీర్‌లో మొదటి సారిగా ఇలా ఓ రీమేక్ సినిమాను తన శైలికి తగ్గట్టుగా మలుచుకుని రంగమార్తాండ అనే సినిమాను తీశాడు.
మరాఠీలో నానా పటేకర్ నట సామ్రాట్ అని తీశాడు. ఆ సినిమాను ప్రకాష్ రాజ్ తెలుగులో చేయాలని అనుకున్నాడు. అయితే అది చివరకు కృష్ణవంశీ చేతికి వచ్చింది. ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి చేత పాడించిన షాయరీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నేనొక నటుడ్ని అంటూ చిరు మాటల ప్రవాహానికి అంతా ముగ్దులయ్యారు. ఈ సినిమాను కొద్ది మందికి ప్రత్యేకంగా చూపించాడు కృష్ణ వంశీ. సినిమాను చూసిన సినీ ప్రముఖులు ముగ్దులయ్యారు.
బ్రహ్మానందం సీన్లు మాత్రం అందరినీ కదిలిస్తాయని, సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ చేస్తారని సినీ సెలెబ్రిటీలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా మాత్రం ఓ కల్ట్ క్లాసిక్‌లా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో కృష్ణ వంశీ మళ్లీ తన మార్క్ చూపించబోవడం మాత్రం ఖాయమైనట్టే.
ముఖ్యంగా బ్రహ్మానందం ఎపిసోడ్ కు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం. చప్పట్లు కొట్టేలా బ్రహ్మానందం నటన అందరిని అలరించబోతోందని టాక్. ఇన్ని వందల సినిమాల్లో నటించిన బ్రహ్మానందం రంగమార్తాండ లో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇదివరకు ఎప్పుడూ చెయ్యని పాత్రలో బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాలో నటించడం విశేషం.
Also Read: Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ
Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి