టీ సిరీస్ ( T Series ) తో ప్రభాస్ ( Prabhas ) ఆదిపురుష్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్ పెదనాన్ని కృష్ణంరాజు (Krishnam Raju ) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆదిపురుష్ ( Adipurush) సినిమా కథ తను విన్నాను అని.. ఇది రామాయణంపై ఆధారపడి తీస్తున్న సినిమా అని...ప్రభాస్ రాముడి పాత్ర చేస్తున్నాడని తెలిపారు. ఈ మూవీని కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు అని స్పష్టం చేశారు కృష్ణంరాజు. ఈ మూవీతో ప్రభాస్ హాలీవుడ్ హీరో ( Prabhas To Hollywood ) అవుతాడని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం హాలీవుడ్ లో రిలీజ్ కానుంది అని తెలిపి కృష్ణంరాజు  బవర్లీ హిల్స్ ( Baverly Hills ) కి ప్రభాస్ తో కలిసి వెళ్తాను అన్నాడు. కేవలం హాలీవుడ్ సార్స్ కు మాత్రమే  బవర్లీ హిల్స్  లో ప్రవేశం ఉంటుంది అని.. ఆదిపురుష్ చిత్రం తరువాత ప్రభాస్ తో కలిసి అక్కడ డిన్నర్ చేస్తానని తెలిపాడు. దీనికి ప్రభాస్ కూడా సిద్ధంగా ఉన్నాడు అని తెలిపాడు కృష్ణంరాజు.  బవర్లీ హిల్స్  లో ప్రభాస్ సొంతంగా ఒక బంగ్లా కట్టాలి అనేది తన కోరిక అన్నాడు.