Krithi Shetty in Nagachaitanya 22 : కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుళు కుటుంబంలో జన్మించింది కృతి శెట్టి. ముంబైలోనే పెరిగిన ఆమె చదువుకునే రోజుల్లోనే కొన్ని యాడ్స్ లో నటించి క్రేజ్ దక్కించుకుంది. హృతిక్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 సినిమాలో స్టుడెంట్స్ లో ఒకరిగా కనిపించి ఆకట్టుకుంది. తరువాత ఆమె 17 సంవత్సరాల వయస్సులో బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఉప్పెనతో హీరోయిన్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి.
 
ఆమె నాని సరసన శ్యామ్ సింఘా రాయ్ సినిమాలో నటించగా ఆ సినిమా 2021లో విడుదలైంది. ఆ తరువాత ఆమె నటించిన బంగారాజు సినిమా కూడా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం,  ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబుతో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . ది వారియర్‌లో రామ్ పోతినేని సరసన లింగుసామి దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 
 
ఇక తాజాగా ఆమె తన హిట్ కాంబో రిపీట్ చేస్తోంది. అక్కినేని నాగ చైతన్య,  కృతి శెట్టిది సూపర్ హిట్ జోడీ అనే చెప్పాలి. 'బంగార్రాజు'లో వీరు కలిసి సందడి చేశారు. తాజాగా ఈ జోడీ మళ్ళీ రిపీట్ అవుతోంది. మరో సినిమాలో నాగ చైతన్య,  కృతి శెట్టి జంట సందడి చేయనుంది. నాగ చైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు,  తమిళ భాషల్లో ఒక సినిమా ప్రకటించారు. ఆ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు ఈ రోజు చిత్ర బృందం ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కారు డానికి సంబందిన్సిన్న ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. అక్కినేని నాగ చైతన్యతో మాత్రమే కాదు... ప్రొడక్షన్ హౌస్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్‌లోనూ కృతి శెట్టికి ఇది రెండో సినిమా. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్'లోనూ ఆమె హీరోయిన్ కాగా ఇది రెండో సినిమా కానుంది. ఇక ప్రారంభోత్సవానికి రానా దగ్గుబాటి,  బోయపాటి,  శివ కార్తికేయన్ వంటి వారు కూడా హాజరయ్యారు. 
 


Also Read: Kangana Ranaut Video Viral: మహారాష్ట్ర ప్రభుత్వ పతనాన్ని ముందే ఊహించిందా.. పాత వీడియో తెరమీదకు!


Also Read: Ram Pothineni Sorry To Lingusamy : అన్నీ చెప్పి అసలు విషయం మర్చిపోయా.. క్షమించమంటూ ట్వీట్!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook