Kriti Sanan To Play Sita Role In Prabhas Adipurush Movie: బాహుబలి ప్రాజెక్టులతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా రాధే శ్యామ్, ఆదిపురుష్ మరియు సలార్ మూవీలతో చేతినిండా సినిమాలతో కెరీర్‌లో భిన్నధోరణిలో వ్యహరిస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ తెరకెక్కుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీకి ఎట్టకేలకు ప్రభాస్ జోడీ దొరికింది. అదేనండీ.. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, సీత పాత్ర కోసం అన్వేషణ ముగిసిందని మూవీ యూనిట్ తెలిపింది. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌ను సీత పాత్రకు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు. సన్నీ సింగ్ సైతం మరో నటుడిని సైతం ఆదిపురుష్ మూవీ యూనిట్‌లోకి ఆహ్వానం పలుకుతూ పోస్ట్ చేశారు. ప్రభాస్‌(Prabhas)కు సీత దొరకడంతో ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది.


Also Read: Kritishetty: ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి మహేశ్ సరసన ఛాన్స్



కాగా, సీత పాత్ర కోసం కొంతకాలం కిందట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)ను సీతాదేవి పాత్ర కోసం సంప్రదించారని ప్రచారం జరిగింది. దాంతో అనుష్క శర్మ సీతగా కనిపిస్తారని అంతా భావించారు. ఆపై కియారా అద్వానీని సీతగా చూడబోతున్నారని వదంతులు వైరల్ అయ్యాయి. కృతి సనన్‌ను సైతం గత డిసెంబర్ నెలలో ఆదిపురుష్(Adipurush) డైరెక్టర్ ఓం రౌత్ సంప్రదించారు. అయితే ఎట్టకేలకు సీత పాత్రకు ఆమె ఓకే చెప్పడంతో మూవీ యూనిట్ హ్యాపీగా ఉంది.


Also Read: Saranga Dariya song controversy కి ఫుల్‌స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook