Adi Purush latest update: ఆదిపురుష్ సినిమాపై రేపు కీలకమైన అప్‌డేట్

Adi Purush latest update: రెబెల్ స్టార్, బాహుబలి ఫేమ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.

Last Updated : Jan 18, 2021, 03:31 PM IST
Adi Purush latest update: ఆదిపురుష్ సినిమాపై రేపు కీలకమైన అప్‌డేట్

Adi Purush latest update: రెబెల్ స్టార్, బాహుబలి ఫేమ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.

బాహుబలి ( Bahubali ) తరువాత అంతటి అంచనాలున్న సినిమా ఆదిపురుష్ ( Adipurush ). రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ( Bollywood Director Om rawat ) దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ కధ ( Ramayan story ) ఆధారంగా భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. ప్రధాన పాత్ర రాముడిగా ప్రభాస్ ( Prabhas in Sriram role ) నటిస్తుండగా..రావణుడి పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ( Saif ali khan as Ravan ) పోషిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్..ఆదిపురుష్ సినిమాతో పెద్ద భారాన్నే భుజాలకెత్తుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ రేపు అంటే మంగళవారం నాడు రానుంది. 

రాముడి పక్కన సీత పాత్ర ( Sita Role ) పైనే అందరి ఆసక్తి నెలకొంది. సీతగా ఎవరు నటించనున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ ఉత్కంఠకు రేపు తెరపడనుందని తెలుస్తోంది. సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రకటించనున్నారు. ఓ పోస్టర్ విడుదల చేయడం ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. సీత పాత్రకు కృతి సనన్ ( Kriti sanon as sita ) ‌ను ఎంపిక చేసినట్టు ఇప్పటికే బాలీవుడ్‌లో టాక్ విన్పిస్తోంది. ఆ టాక్ నిజమా కాదా అనేది రేపు తేలిపోనుంది. 

కేజీఎఫ్ ( KGF ) దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashant neel ) దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమా( Salar movie )..ప్రభాస్‌తో రాబోతుంది. ఆదిపురుష్ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో..సలార్ ముందా..లేదా ఆదిపురుష్ ముందా అనేది తేలాల్సి ఉంది. 

Also read: Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News