Kritishetty: ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి మహేశ్ సరసన ఛాన్స్ ?

Kritishetty: ఉప్పెన సినిమాతో యువత గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న కృతిశెట్టికి అరుదైన అవకాశం ఒక్క సినిమాతోనే లభించేసిందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న సినిమాలో సూపర్‌స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2021, 11:55 PM IST
  • ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టికి బంపర్ ఆఫర్
  • సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశం
  • అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న సినిమాలో నటించే ఛాన్స్
Kritishetty: ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి మహేశ్ సరసన ఛాన్స్ ?

Kritishetty: ఉప్పెన సినిమాతో యువత గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న కృతిశెట్టికి అరుదైన అవకాశం ఒక్క సినిమాతోనే లభించేసిందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న సినిమాలో సూపర్‌స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్.

టాలీవుడ్‌(Tollywood)లో ఉప్పెన సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పుడే వందకోట్ల క్లబ్‌లో చేరిపోయింది ఈ సినిమా. సినిమాలో కృతిశెట్టి నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఉప్పెన (Uppena) హిట్‌కు కృతిశెట్టి అభినయం ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. కన్నడ భామ కృతిశెట్టి(Kritishetty)కి ఇప్పుడు ఈ ఒక్క హిట్‌తోనే బంపర్ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ సరసన సినిమా ఛాన్స్ లభించిందని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో కృతిశెట్టి క్రేజ్ మరింతగా పెరగడంతో అటు రెమ్యునరేషన్ కూడా పెరిగింది. ఇప్పుడీ గోల్డెన్ ఆఫర్‌తో ఆమె స్థాయి మరింతగా పెరిగిపోయింది.

ప్రస్తుతం మహేశ్ (Mahesh babu)తన 27వ చిత్రం సర్కారు వాటి పాటతో బిజిగా ఉన్నాడు. సినిమా పూర్తి కాగానే రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేశ్ సినిమా ఉంటుందని సమాచారం. అయితే రాజమౌళి సినిమాకు మరింత సమయం పడుతుంది కాబట్టి..ఆ గ్యాప్‌లో అనిల్ రావిపూడి మహేశ్‌తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కృతిశెట్టిని మహేశ్ సరసన ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పటికే మహేశ్‌తో సరిలేరు నీకెవ్వరూ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి..త్వరలోనే మహేశ్-కృతిశెట్టి సినిమా పనులు ప్రారంభించవచ్చు.

Also read: Radheshyam movie: ఆకట్టుకుంటున్న రాధేశ్యామ్ న్యూ రొమాంటిక్ లుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News