Kushboo Sundar in Varisu దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా ఇప్పుడు తమిళ బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడేస్తోంది. ఆల్రెడీ రెండు వందల కోట్ల క్లబ్బులోకి చేరింది. అయితే ఈ చిత్రంలో కుష్పూ నటించిందనే విషయం చాలా మందికి మాత్రమే తెలుసు. ఆమె నటించిన సీన్లను చివరి నిమిషంలో లేపి అవతల పారేశారట. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దాని వల్ల దిల్ రాజుకు పది కోట్ల మేర నష్టం కలిగినట్టు టాక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంశీ పైడిపల్లి తీసే సినిమాలన్నీ కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గానే నిలుస్తుంటాయి. ఎంతో రిచ్‌గా తీయాలనే తాపత్రయం కనిపిస్తుంది. ఇక ఎంత తీస్తున్నాం..ఏ సీన్లు తీస్తున్నాం..ఇది చివరకు ఉంటుందా? ఎడిటింగ్‌లో లేపేస్తామా? అన్న సోయి లేకుండా ఇష్టమొచ్చినట్టుగా తీసేస్తుంటాడు. అలా వంశీ పైడిపల్లి సినిమాలు బాగానే ఉన్నా కూడా బడ్జెట్ పరంగా, కలెక్షన్ల పరంగా తేడా కొట్టేస్తుంది. నిర్మాతకు చివరకు నష్టాలనే మిగులుస్తుంటుంది.


ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాలోనూ అదే రిపీట్ అయిందట. కుష్బూతో తీసిన సీన్లను మొత్తంగా లేపేశారట.ఆ సీన్ల కోసం దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె నటించిన సీన్లను లేపేయడంతో పది కోట్లు బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక ఆమె రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే ఉందని తెలుస్తోంది. మొత్తానికి తన సీన్లను లేపేయడం మీద కుష్బూ వెరైటీగా స్పందించింది. నేను వారసుడు సినిమాలో నటించాను అని మీకు చెప్పానా? అంటూ కౌంటర్ వేస్తోందట.


సినిమా ఎడిటర్ మాత్రం కుష్బూకి సారీ చెప్పాడు. లెంగ్త్ వల్లే ఆ పాత్రను తీసేయాల్సి వచ్చిందని, అది చాలా మంచి పాత్ర అని, కాకపోతే నిడివి వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని దర్శకుడు ముందుగానే ఆమెకు చెప్పాడట. అప్పుడు కుష్బూ కూడా స్పోర్టివ్‌గానే తీసుకుందట.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook