Laggam Teaser Launch: పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్న ఈ సమయంలో మరొక చిన్న సినిమా ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అదే లగ్గం. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. రమేష్ చెప్పాల కథ, మాటలు స్క్రీన్ ప్లే రచించారు. సినిమాకి దర్శకత్వం కూడా ఆయనే వహించారు. తెలుగు ఇళ్లల్లో ఉండే పెళ్లి సమయంలో విందులు చిందులు వంటి కార్యక్రమాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు హీరో ఆది సాయికుమార్ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. "లగ్గం టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా విజువల్స్ చాలా బాగా వచ్చాయి. డైరెక్టర్ గారు మంచి టేస్ట్ తో ఈ సినిమాని తీశారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్ గారు, రోహిణి గారు, కృష్ణుడు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 


డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "లగ్గం సినిమా చాలా బాగా రావడానికి కారణం అయిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు నాకు కథ ను నమ్మారు. సినిమాకి కథే బలం. కుటుంబం మొత్తం వచ్చి కలిసి చూసేలాగా ఈ సినిమా ఉంటుంది" అని హామీ ఇచ్చారు డైరెక్టర్.


నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. "ఏదైనా ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటున్నా సమయంలో డైరెక్టర్ రమేష్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. నాకు కదా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాను. సినిమాలో మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను" అని అన్నారు.


నటి రోహిణి మాట్లాడుతూ.. "సినిమా కోసం రమేష్ గారు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలోని సంభాషణలు అందరినీ ఆలోచింపచేస్తాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్. సినిమాకి అన్ని చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలో చాలా మనసుకి హత్తుకునే సన్నివేశాలు కూడా ఉన్నాయి" అని అన్నారు.


సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నటించడం నా అదృష్టం. మంచి సినిమా చేశాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. నన్ను ఎప్పటినుంచో ఎంకరేజ్ చేస్తున్నా మీడియాకి నా కృతజ్ఞతలు. మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను" అని అన్నారు.


చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. సినిమా పాటలు బాగా వచ్చాయి అని.. అందరూ పాటలను రిపీటెడ్ గా వినడం చూసి సంతోషంగా ఉంది అన్నారు. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ..లగ్గం సినిమాకు ఎడిటర్ గా పని చెయ్యడం సంతోషంగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ సినిమాకు వర్క్ చేసినట్టు అనిపించింది అని అన్నారు.


Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.