Lara Dutta Andaaz బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 16). బాలీవుడ్‌లో అందాజ్ సినిమాలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా లారా దత్తా, మిస్ వరల్డ్‌గా ప్రియాంక చోప్రా ఎన్నికైన సంగతి తెలిసిందే. అందాజ్ సినిమా 2003లో వచ్చింది. ఈ చిత్రంలో లారా దత్తా, ప్రియాంక చోప్రాలు నటించారు. ఈ మూవీలో హీరోగా అక్షయ్ కుమార్ నటించింది. ముక్కోణపు ప్రేమ కథతో లారా దత్తా, ప్రియాంక చోప్రాలు అద్భుతంగా నటించారు. అవార్డులు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ సినిమా టైంలో ఇద్దరి కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు డిఫరెంట్‌గా ఉండేవట. ఒకే రకమైన పాత్రలు చేయకూడదని అనుకునేవారట. సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి నటించిన ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై సినిమాతో ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందాజ్ సినిమాతో లారా దత్తా సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ టైంలో సినిమాలపై, సినిమా కెరీర్‌పై ప్రియాంక చోప్రా, తనకు డిఫరెంట్ ఆలోచనలుండేవట.


తామిద్దరం విభిన్న నటీమణులమని, విభిన్న ఆశయాలుండేవని లారా దత్తా చెప్పుకొచ్చింది. నేను భిన్న నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాను.. మదర్ ఇండియాలో నర్గీస్ చేసిన పాత్రను సైతం చేయాలని, అలా నటిగా, గ్లామర్ డాల్‌గానూ మెప్పించాలని అనుకుందట. అన్ని రకాల పాత్రలను పోషించాని భావించిందట. ఏ పాత్రనైనా పోషించగలదని ప్రేక్షకులు అనుకునేలా చేయాలని ఫిక్స్ అయిందట.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


లారా దత్తా 2021లో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమాలో కనిపించింది. అందులో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. 2022లో జీ5 ఫ్యామిలీ డ్రామా అయిన కౌన్ బనేగి షికార్‌వతిలో కనిపించింది. అగతా క్రిస్టీ మిస్టరీ నటిస్తున్న చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీలో లారా దత్తా నటిస్తోంది.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook