Laxmi Raai Breakup: ధోనితో బ్రేకప్ మచ్చ తెచ్చిపెట్టింది.. నా లైఫ్‌లో ఎన్నో బ్రేకప్స్ జరిగాయి: లక్ష్మీరాయ్
Laxmi Raai Recalled Her Breakup : ధోనితో బ్రేకప్ అయిపోయి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏ విషయంపై అయినా చర్చ జరిగితే చాలు.. తన పేరు ప్రస్తావిస్తున్నారని బాధపడింది.
Laxmi Raai Recalled Her Breakup With MS Dhoni: చాలా మంది క్రికెటర్స్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో ప్రేమయాణం నడిపారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే కొందరు క్రికెటర్ల లవ్ మ్యాటర్స్‌లో ఏవే ప్రాబెమ్స్ వచ్చి ఫెయిల్ అవుతుంటాయి కూడా.
ఇక గతంలో మహేంద్ర సింగ్ ధోనితో (Mahendra Singh Dhoni) హీరోయిన్ రాయ్ లక్ష్మి ప్రేమాయాణం (Love affair) నడిపినట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. 2008 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య లవ్ పుట్టిందని టాక్. ఆ సమయంలో ఆ టీమ్ ప్రచారకర్తగా లక్ష్మీరాయ్ (Laxmi Raai) ఉన్నారు.
అప్పట్లో జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్‌లక్ష్మీ కూడా వెళ్లేది. దాదాపు ఏడాది పాటు వీరిద్దరి మధ్య డేటింగ్ నడిచిందట. అయితే లక్ష్మీరాయ్‌తో అప్పట్లో ఈ ప్రేమ వ్యవహారం.. పెళ్లిదాకా వెళ్లిందని కూడా సమాచారం. కానీ ఏమైందో ఏమో కానీ.. ధోని, లక్ష్మీరాయ్‌లు సంవత్సరంలోపూ బ్రేకప్ (Breakup) చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇక రాయ్‌లక్ష్మీతో బ్రేకప్ అయ్యాక ధోని.. సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ధోనితో అప్పట్లో నడిపిన లవ్ ట్రాక్‌పై (Love track) లక్ష్మిరాయ్ స్పందించింది. ధోనితో రిలేషన్ తన లైఫ్‌లో ఓ మచ్చగా మారిందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ అయిపోయి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏ విషయంపై అయినా చర్చ జరిగితే చాలు.. తన పేరు ప్రస్తావిస్తున్నారని బాధపడింది. ఇక తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టాక కూడా ఇలాగే గుర్తు చేస్తారేమో అంటూ లక్ష్మీరాయ్ అన్నారు.
Also Read : Karnataka Corona rules: కరోనా టీకా తీసుకున్న వారికే మాల్స్‌లోకి ఎంట్రీ!
ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో (Relationship) ఉన్నాక.. పరస్పర అంగీకారంతోనే ధోని, తాను విడిపోవాలని డిసైడ్ అయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఎలాంటి గొడవలు లేకుండానే తాము బ్రేకప్ చెప్పుకున్నామని లక్ష్మీరాయ్ పేర్కొన్నారు. బ్రేకప్ (Breakup) అయ్యాక కూడా తమకు ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉందని చెప్పింది. తన లైఫ్‌లో ఇప్పటికే చాలా బ్రేకప్స్ జరిగాయని అయినా కూడా తానెప్పుడూ బాధపడలేదని లక్ష్మీరాయ్ అన్నారు. తాను ప్రస్తుతం జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. తన దృష్టి అంతా కూడా ఇప్పుడు కెరీర్ పైనే ఉందని రాయ్ లక్ష్మి (Roy Lakshmi) అన్నారు.
Also Read : Lizard: 7వేల కి.మీ ప్రయాణించిన బల్లి... ఎలా సాధ్యమైందంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook