Karnataka Corona rules: కరోనా కొత్త వేరియంట్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి, వ్యాక్సిన్ తప్పనిసరి రూల్స్‌ను తీసుకొస్తున్నాయి.
ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాల్స్‌లోకి అనుమతినించాలని (Karnataka on Corona Vaccination) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి బెంగళూరులోని మాల్స్ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.
సినిమా థియేటర్ల వద్ద కూడా ఇదే విధమైన నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
మాల్స్‌లోకి వచ్చే వారిని ముందుగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూయించమని సిబ్బంది కోరుతున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని మాత్రమే మాల్స్‌లోకి (Vaccination certificate is mandatory for entry into Malls) అనుమతినిస్తున్నారు.
Bengaluru | Mall visitors being asked for their complete vaccination certificates before entry into the mall, as per Karnataka govt rules
This is a very good move to ensure the safety of people by the state govt. There is no reason to not take the COVID vaccine, says a visitor. pic.twitter.com/iOAkeyLuGg
— ANI (@ANI) December 4, 2021
ఇది మంచి నిర్ణయం..
ఈ నిర్ణయంపై బెంగళూరులో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ప్రజల క్షేమం కోసం ఇది ఉపయోగకరమైందని అంటున్నారు.
ప్రభుత్వం కొత్త నిబంధనలతో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకునే వారు వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు బారులు తీరారు.
కర్ణాటక కరోనా కట్టడి చర్యలు ఇలా..
- రోజువారీ కొవిడ్ పరీక్షలను 60 వేల నుంచి లక్షకు పెంచాలని ప్రభుత్వం (Corona tests in Karnataka) నిర్ణయించింది.
- రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి 15 రోజులకు ఓసారి ర్యాండమ్‌గా విద్యార్థులకు కరోనా టెస్టులు.
- పెళ్లిలు, మీటింగ్స్ సహా ఇతర కార్యక్రమాల్లో 500 మందికి మించ కూడదు.
- 18 ఏళ్ల లోపు విద్యార్థుల తల్లిదండ్రులు రెండు డోసుల వ్యాక్సిన్ కచ్చితంగా (Vaccination is mandatory) తీసుకోవాలి.
Also read: Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్‌ల నుంచి మాల్స్ వరకు నో ఎంట్రీ'!
Also read: Kanpur Professor kills his family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook