K S Sethumadhavan passes away: జాతీయ అవార్డు గ్రహీత, సినీ నిర్మాత, దర్శకుడు కేఎస్ సేతుమాధవన్(90) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1931లో కేరళలోని ఉత్తర పాలక్కడ్ జిల్లాలో జన్మించారు సేతుమాధవన్ (K S Sethumadhavan). ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.  ఆయన మలయాళం (Malayalam)లో 1960లో 'జ్ఞాన సుందరి' (Jnana Sundari) అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. మెుదటసారి 'వీరవిజయ' (Veeravijaya) అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. లెజెండరీ యాక్టర్​ కమల్ హాసన్​ (Kamal Haasan)ను బాలనటుడిగా 'కన్నుమ్ కరాలుమ్'’ చిత్రం ద్వారా మలయాళంలో పరిచయం చేసింది ఈయనే. కమల్​తో కలిసి తమిళంలో 'నమ్మవర్​' అనే సినిమా కూడా తీశారు సేతు మాధవన్. 


Also Read: Bigg Boss Telugu 6: ఓటీటీ వేదికగా తెలుగు బిగ్ బాస్... మళ్లీ నాగార్జునే హోస్ట్..!


మలయాళం సహా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 60కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు సేతు మాధవన్. జాతీయ అవార్డు, కేరళ ప్రభుత్వ అవార్డు సహా ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఈయన సినిమాల్లోని పది చిత్రాలకు జాతీయ అవార్డులు (National Awards) వచ్చాయి. అందులో తెలుగులో 1995 తీసిన 'స్త్రీ' అనే సినిమా కూడా ఉంది. పాలగుమ్మి పద్మరాజు రాసిన 'పడవ ప్రయాణం' అనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు సేతుమాధవన్​. ఈ చిత్రాన్ని రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వరించాయి. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరి, స్పెషల్ మెన్షన్ కేటగిరి కింద సినిమాలో నటించిన రోహిణికి అవార్డులు దక్కాయి. 


సేతుమాధవన్ 2009లో కేరళ ప్రభుత్వం చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జేసీ డేనియల్ అవార్డు (J C Daniel Award) కూడా గెలుచుకున్నారు.  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్​ను కూడా 'నాలై నమత్తే' సినిమాలో డైరెక్ట్​ చేశారాయన. ఆయన చివరి చిత్రం జ్ఞానపీఠ గ్రహీత ఎమ్‌టి వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'వెనల్కినావుకల్'.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook