Like Share & Subscribe Review: సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ
Like Share & Subscribe Review: సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉంది అనేది అనేది రివ్యూలో చూద్దాం.
Like Share & Subscribe Review: నవంబర్ 4వ తేదీన సుమారు 8 సినిమాలు విడుదలయ్యాయి. అందులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక సినిమాని ప్రమోట్ చేసే వేగం పెంచిన సినిమా యూనిట్ అనేక రకాలుగా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. జాతి రత్నాలు లాంటి సూపర్ హిట్ తర్వాత ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కథ :
చదువు పూర్తి చేసి ఎలా అయినా ఒక మంచి ట్రావెల్ యూట్యూబర్ అవ్వాలని కోరికతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు విప్లవ్(సంతోష్ శోభన్) ఈ నేపథ్యంలోనే అరకు చేరుకున్న తర్వాత అతనికి తాను ఎంతగానో అభిమానించే వసుధ వర్మ(ఫరియా అబ్దుల్లా) అనే మరో తెలుగు వ్లాగర్ కూడా పరిచయమవుతుంది. ఆమె మీద ప్రేమను వ్యక్తపరిచేలోపే ఆమె అతను ఆమె అంటే అసహ్యాన్ని బయట పెడుతుంది. ఈ క్రమంలో కొందరు నక్షలైట్లు కూడా ఎదురవుతారు. ఆ తర్వాత ఆమె డీజీపీ కూతురు అని తెలుస్తుంది డిజిపి కూతురని తెలిసిన తర్వాత నక్సలైట్లు ఆమెను ఏం చేశారు? ఆమెను విప్లవ్ కాపాడుతాడా? ఆమె రక్షించుకునేందుకు డీజీపీ ఏం చేశారు? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సాధారణంగా ఒక చిన్న పాయింట్ తీసుకుని దీంతో సినిమా మొత్తాన్ని తీయగల సత్తా కేవలం మలయాళ దర్శకులకు మాత్రమే ఉందని భావిస్తూ ఉంటాం కానీ మన తెలుగులో అలాంటి దర్శకులు ఉన్నారు అబే విషయాన్ని దర్శకుడు వేర్లపాక గాంధీ ఈ సినిమాతో నిరూపించే ప్రయత్నం చేశాడు. ట్రావెల్ వ్లాగ్గింగ్ కెరీర్ గా ఎంచుకోవాలని భావించే ఒక యువకుడు అనూహ్యంగా అడవుల్లోకి వెళ్లి ఇబ్బందుల్లో పడడం, అతన్ని కాపాడడం కోసం అదే అడవికి వెళ్లిన వసుధ ప్రయత్నించడం ఆ తర్వాత వారికి నక్సలైట్లు ఎదురు పడటం ఇలా ఒక చిన్న పాయింట్ ను పట్టుకుని దీంతో ఒక పెద్ద కథనే నడిపించాడు దర్శకుడు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ట్రెండు బాగా పెరిగిపోయింది. ఖాళీగా ఉన్న వారంతా ట్రావెల్ వ్లాగ్గింగ్ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో దాన్ని పాయింట్ గా తీసుకుని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు గాంధీ. చిన్న చిన్న లోపాలు కనిపించినా సినిమా మొత్తం కూడా ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనిపించినా సరే పూర్తిస్థాయిలో సినిమా మాత్రం కొందరిని ఆకట్టుకుంటుంది. కొంత మంది మాత్రం సినిమాను బోర్ ఫీల్ అవుతారు.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్ చాలా ఈజ్ తో నటించాడు. ఇక చిట్టి కూడా తనదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. డీజీపీ పాత్రలో తమిళ నటుడు ఆకట్టుకున్నారు. అలాగే సుదర్శన్, బ్రహ్మాజీ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. బ్రహ్మాజీ బ్యాచ్ లో కనిపించే అందరూ కూడా తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కానీ వారందరినీ కూడా బ్రహ్మాజీ డామినేట్ చేయడం కనిపిస్తుంది.
టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు మేర్లపాక గాంధీ కథ రాసుకున్న విధంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. ప్రతి సీన్ లోనూ చాలా కేర్ తీసుకుని సినిమా షూట్ చేసినట్లు అనిపించినా కొంత ల్యాగ్ ఇబ్బంది పెడుతుంది. కథగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న లోపాలు దొర్లినా ఓవరాల్ గా ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో సినిమా సక్సెస్ అవుతుంది. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు - రామ్ మిరియాల సంగీతం అందించారు. ఆ సంగీతం ఆకట్టుకుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. వసంత్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఇక తక్కువ బడ్జెట్ సినిమా అయినా కూడా సినిమా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు. రాము తూము ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటె బాగుండేది.
ఫైనల్ గా చెప్పాలంటే
ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ చూసిన తర్వాత మీలో కొంత మంది సినిమాని లైక్ చేస్తారు. కొంత మంది బోర్ ఫీలవుతారు.
రేటింగ్: 2.25/5
Also Read: Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే
Also Read: Samantha-Amala: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook