Indira Devi Death Live Updates: మహేష్ తల్లి మృతి.. మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆఘట్టమనేని కుటుంబ సభ్యలు ధృవీకరించారు.
Indira Devi Death Live Updates: సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆఘట్టమనేని కుటుంబ సభ్యలు ధృవీకరించారు.
Latest Updates
మహా ప్రస్థానంలో ఘట్టమనేని ఇందిరా దేవి గారి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. మహేష్ బాబు తల్లి చితికి నిప్పు అంటించారు.
ఇక ఇందిరాదేవి నివాసానికి కృష్ణ, మహేష్ బాబు తదితరులు చేరుకున్నారు.
మహాప్రస్థానం లో జరిగే ఇందిరా దేవి అంత్యక్రియల కవరేజ్ కు మీడియాకు అనుమతి లేదని కృష్ణ కుటుంబ సభ్యులు ప్రకటించారు. కవరేజ్ పద్మాలయా స్టూడియోస్ వరకే పరిమితం అవుతుందని, అక్కడి నుంచి మీడియాకు అనుమతి ఉండదని, దయచేసి మీడియా వారు సహకరించగలరని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.
''ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను'' : పవన్ కళ్యాణ్
''ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' : నందమూరి బాలకృష్ణ
''శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను'': మెగాస్టార్ చిరంజీవి