Lucky Baskhar Lucky Baskhar OTT News: దుల్కర్ సల్మాన్.. పేరుకు మల్లూవుడ్ హీరో అయినా.. తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో డైరెక్ట్ గా మహానటి, సీతారామం, కల్కి సినిమాలతో పలకరించాడు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’
సినిమాలో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్రలో అలరించాడు. ఈ సినిమా ను వెంకీ అట్లూరి.. 1980, 90 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ముఖ్యంగా హర్షద్ మెహతా జీవితాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ తరహాలో ఓ సినిమా, వెబ్ సిరీస్ కూడా రూపొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేట్రికల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా ఇపుడు ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 30న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో 5 భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కామన్ మ్యాన్ పాత్రలో అలరించాడు. ఈ సినిమా తెలుగులో రూ. 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 15 కోట్ల షేర్ అందుకొని బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.


మరోవైపు ఈ సినిమా రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 33 కోట్ల షేర్ (రూ. 70 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది. మొత్తంగా దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా హాట్రిక్ విజయాలను నమోదు చేయడం విశేషం. మొత్తంగా దీపావళి సినిమాల్లో యునానిమస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మాత్రం వసూళ్లలో వెనకబడింది. ఏది ఏమైనా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. మొత్తంగా థియేటర్స్ లో నడుస్తుండగానే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. మొత్తంగా థియేట్రికల్ గా ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 30 నుంచి ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చన్న మాట.  


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.