M4M update: మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల ఆసక్తికరమైన.. విషయాలను వెల్లడించారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ప్రయత్నించని వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. పది సంవత్సరాల పాటు ఈ సినిమా గురించి చర్చించుకుంటారని.. చెప్పడం విశేషం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవాలో జరిగిన ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఫిల్మ్ ఫెస్టివల్‌లో హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.  


జో శర్మ మాట్లాడుతూ, మోహన్ వడ్లపట్ల తనకు గొప్ప అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతుందని, ప్రేక్షకులు ఊపిరి బిగపట్టే అనుభూతి పొందుతారని చెప్పారు.  


ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందింది. త్వరలోనే ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


కాగా ఈ చిత్రంలో జో శర్మ (యూఎస్ఏ), సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  కథ, దర్శకత్వం...మోహన్ వడ్లపట్ల అందించిన ఈ చిత్రానికి.. వసంత్ ఇసాయిపెట్టై సంగీతం అందించారు. శ్రీచక్ర మల్లికార్జున  డైలాగ్స్ రాయగా.. పవన్ ఆనంద్ ఎడిటింగ్.. కొత్తపల్లి ఆది  వి.ఎఫ్.ఎక్స్ అందించారు.


ఈ చిత్రంలో ఎంఫోర్ఎం కథాంశం, సీరియల్ కిల్లర్ అంశం ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం.. ఖాయంలా కనిపిస్తోంది.


Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'


Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter