MAA Elecrtions 2021: ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు రవి బాబు
మా ఎన్నికల పోరు ఎన్నడు లేని విధంగా రసవత్తరంగా మారుతున్న తరుణంలో నటుడు, డైరెక్టర్ రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. `మా` అసోసియోషన్ నడపటం మనకు చేత కాదా ? అంటూ విరుచుకు పడ్డారు.
MAA Elecrtions 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) ఎన్నికలు రోజు రోజు కు రసవత్తరంగా మారుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే! పోటీ పడుతున్న అభ్యర్థులు విమర్శలు, సవాళ్లతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.
నిన్న ఉదయం ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో (POstal Ballot) దుర్వినియోగం జరుగుతుంది, 60 ఏళ్లు పై బడిన మా సభ్యులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు కానీ మంచు విష్ణు ప్యానల్ ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. మంచు విష్ణు (Machu Vishnu) మరియు వారి ప్యానల్ కలిసి 60మందితో పోస్టల్ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Viral News: ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ చేస్తే 'ఇటుక ముక్క, డెటాల్ సబ్బు, ఘడీ సబ్బు' వచ్చాయి
ఇదిలా ఉండగా... మంచు విష్ణు కూడా నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ (Praksh Raj) చేసిన వాటికీ ఘాటుగానే స్పందించాడు. అంతేకాకుండా, జీవిత రాజశేఖర్ (Jeevitha Rajshekar) మరియు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు "తమ తండ్రి పేరు ఎందుకు తీసుకొస్తున్నారని, 'మా' అనేది ఒక కుటుంబం, ఎన్నికల తరువాత అందరం కలిసి ఉండాల్సిందే.. కావున ఎలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించండని, కుటుంబాలను ఇందులో లాగకండని వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా 'మా' ఎన్నికల పై నటుడు మరియు దర్శకుడు రవిబాబు (Actor Ravi Babu) సంచలన వ్యాఖ్యలు చేసారు. మన సినిమా ఇండ్రస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్‌లు చాలా మంది ఉన్నా... ఎందుకు ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకోవటం, మన దగ్గర ఉన్న కెమెరా మెన్ లు పని లేక ఖాళీగా తిరుగుతున్నా... మనం ఎందుకు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొస్తున్నామని అన్నారు.
Also Read: Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా
అంతేకాకుండా, 'మా' అనేది మనం ఏర్పాటు చేసుకున్న చిన్న కుటుంబం లాంటిది దీనిని నడపటం కూడా మనకు చేత కాదా..?? ఎవరో వచ్చి ఇది కూడా ఇది కూడా బయట నుండి వచ్చి ఎవరొకరు మనకు నేర్పించాలా.. ఒకేసారి ఆలోచించండి అంటూ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook