Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీ ఘటన ఇంకా రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఓ వైపు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే..కేంద్రమంత్రి మాత్రం ఆ ఆధారం చూపిస్తే రాజీనామాకు సిద్ధమంటున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2021, 12:55 PM IST
  • ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీలో చల్లారని రాజకీయ వేడి
  • లఖీంపూర్ ఖీరీ పర్యటనకు రాహుల్ గాంధీ యత్నం, నిరాకరించిన పోలీసులు
  • లఖీంపుర్ ఘటనలో ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానంటున్న మంత్రి
Lakhimpur Kheri: ఒక్క ఆధారం చూపించినా..మంత్రి పదవికి రాజీనామా చేస్తా

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీ ఘటన ఇంకా రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఓ వైపు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే..కేంద్రమంత్రి మాత్రం ఆ ఆధారం చూపిస్తే రాజీనామాకు సిద్ధమంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీలో(Lakhimpur Kheri)జరిగిన రైతు మరణాలపై రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లఖింపూర్‌ ఖేర్‌ పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతించలేదు. బన్‌బీర్‌పూర్‌ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, అజయ్‌ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్‌ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్‌యూవీలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు లఖింపూర్‌ ఘటనలో కేంద్ర‌మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను ఇంకా అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. పోలీసులు తన పర్యటనకు అనుమతివ్వకపోవడంతో  రాహుల్ గాంధీ(Rahul Gandhi)..యూపీ ప్రభుత్వంపై(Up Government)ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. యూపీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ..లఖీంపూర్ ఖీరీని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.

ఇటు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా(Union minister ajay mishra)స్పందించారు. ఈ ఘటనలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్టుగా ఒక్క ఆధారం చూపించినా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కారు అదుపు తప్పి రైతులపై దూసుకెళ్లిందని..ఆ సమయంలో తన కుమారుడు లేడని చెప్పారు. లఖీంపూర్ ఖీరీ ఘటనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. పార్టీ అధిష్టానం కూడా తనకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. 

Also read: LPG cylinders Petrol Diesel Prices Hiked : మళ్లీ వంటగ్యాస్ ధర పెరిగింది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల మోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News