Maatarani Mounamidi Movie Review: మాటరాని మౌనమిది మూవీ రివ్యూ
Maatarani Mounamidi Movie Review in Telugu: సుక్కూ పూర్వజ్ దర్శకత్వంలో రూపొందిన మాటరాని మౌనమిది మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Maatarani Mounamidi Movie Review in Telugu: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు అనేక చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో మాట రాని మౌనమిది అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ టీజర్ సహా పాటలు సినిమా మీద ఆసక్తి కలిగేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
మాటరాని మౌనమిది సినిమా కథ:
రామ్ (మహేష్ దత్త) చాలాకాలం తర్వాత తన బావ ఈశ్వర్(శ్రీహరి ఉదయగిరి)ని కలిసి ఎందుకు అతను నివసించే అరకు వెళతాడు. అరకులోనే ఒక పెద్ద బంగ్లాలో ఈశ్వర్ నివసిస్తూ ఉంటారు. అయితే ఈశ్వర్ పని మీద బయటకు వెళ్లడంతో రామ్ ఒక్కడే ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఆరోజు రాత్రే ఇంట్లో చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దీంతో రామ్ ఆ శబ్దాలు వచ్చిన వైపు వెళ్లి గది తలుపులు తెరిచి చూస్తే అక్కడ ఈశ్వర్ శవం కనిపిస్తుంది. పని మీద బయటకు వెళ్లిన ఈశ్వర్ అక్కడ శవమై ఉండటమేమిటి అని భయపడి రామ్ అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తాడు. అయితే బయటకు ఎలా వెళ్లాలో అర్థం కాక రాత్రంతా హాల్లోనే గడుపుతాడు. ఎలాగోలా రాత్రి గడిచి తెల్లవారగానే ఈశ్వర్ తిరిగి వస్తాడు. ఈశ్వర్ తిరిగి వస్తే చనిపోయిన నువ్వు ఎలా తిరిగి వచ్చావని అడుగుతాడు రామ్. అదేంటని అడిగితే రాత్రి జరిగిందంతా చెప్పడంతో ఈసారి ఈశ్వర్ పైకి వెళ్లి చూస్తే అక్కడ రామ్ శవం కనిపిస్తుంది. అలా రామ్ శవం ఈశ్వర్ కు, ఈశ్వర్ శవం రామ్ కి కనిపిస్తూ ఉండడంతో వారిద్దరు షాక్ అవుతారు. అసలు అలా ఎందుకు కనిపిస్తోంది? ఆ ఇంట్లో ఉన్న మిస్టరీ ఏమిటి? అసలు ఈ మిస్టరీ కథ ఉన్న సినిమాకు మాటరాని మౌనమిది అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ :
ఒక లవ్ స్టోరీ, దాని చుట్టూ అల్లిన థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రం మాట రాని మౌనం ఇది. దర్శకుడు సుక్కూ పూర్వజ్ ఎంచుకున్న పాయింట్ కాస్త భిన్నంగా ఉంది. సాధారణంగానే ప్రేక్షకులు మిస్టరీ థ్రిల్లర్ మూవీల మీద ఆసక్తి చూపిస్తారు. దాన్నే ప్రధానంగా ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సస్పెన్స్ ట్విస్టులు ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. కానీ స్లోనరేషన్ వల్ల కాస్త లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే తాను ఎంచుకున్న కథను దర్శకుడు ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి అందులో దాదాపు సఫలం అయ్యాడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మీద ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. అయితే అక్కడి నుంచి కథ అనుకోని విధంగా మలుపు తిరుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కూడా కాస్త లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మొత్తం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ పాత్రలో మహేష్ దత్తా పూర్తిస్థాయి న్యాయం చేశాడు. ఆయనకి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా కూడా కొత్త నటుడు అని అనిపించే విధంగా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇక రామ్ బావ ఈశ్వర్ పాత్రలో శ్రీహరి ఉదయగిరి కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరి చుట్టూనే కథ రాసుకున్నారు కాబట్టి ఈ ఇద్దరూ కూడా దాన్ని తమ నటనతో సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత క్లాసికల్ డాన్సర్ సీత పాత్రలో సోని శ్రీవాత్సవ కూడా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాస్త భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర అయినా ఆమె తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక వీరు కాకుండా అర్చన అనంత్, సునీల్ శెట్టి, సంజీవ్ వంటి వారు కూడా తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే సంగీతం అందించిన ఆషీర్ పాటలు పెద్దగా నోటెడ్ కాలేదు కానీ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగినట్లుగా సెట్ అయింది. అయితే పాటల్లో కూడా దంపుడు లచ్చి అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక చరణ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగినట్లు కుదిరాయి.
ఫైనల్ గా చెప్పాలంటే :
హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే మిస్టరీ టైప్ సినిమాలను చూడాలనుకునేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
Rating: 3/5
Also Read: Karthikeya 2 Crosses Laal Singh Chaddha: 'లాల్'కు షాకిచ్చిన కార్తికేయ 2.. మాములు దెబ్బ కాదుగా!
Also Read: Raashi Khanna Hot Photos: మునుపెన్నడూ లేనివిధంగా రెచ్చిపోయిన రాశి ఖన్నా.. నెవర్ బిఫోర్ అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి