Madhuri Dixit rents flat in Mumbai: బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్ దంపతులు ముంబైలోని వర్లీలో ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లోని లగ్జరీ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నారు. 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నెల అద్దె రూ.12.50 లక్షలు. ప్రముఖ ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్ ఈ ఇంటిని డిజైన్ చేశారు. వర్లీలోని హై-రైజ్ అపార్ట్‌మెంట్స్‌లోని 29వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉన్నట్లు అపూర్వ ష్రాఫ్ తెలిపారు. రాత్రిపూట ఈ ఫ్లాట్ నుంచి సిటీ వ్యూ అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి డిజైన్‌కి సంబంధించి మాధురీ దీక్షిత్ ఆమె భర్త చేసిన సూచనలు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయని.. ఆ ఇద్దరు చాలా డౌన్ టు ఎర్త్‌ అని అపూర్వ ష్రాఫ్ పేర్కొన్నారు. మాధురీ దీక్షిత్ ఫ్లాట్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'మేము పని మొదలుపెట్టడానికి ముందు ఇల్లు ఇలా ఉంది. అయితే పెద్దగా నిర్మాణాత్మక మార్పులేమీ చేయాల్సిన అవసరం రానందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాం. నా క్లైంట్ అభిరుచికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఇంటిని తీర్చిదిద్దాలి.' అని అపూర్వ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. 


కాగా, ఒకప్పుడు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన మాధురీ దీక్షిత్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో తేజాబ్, దేవదాస్, దిల్ తో పాగల్ హై, హమ్ ఆప్కే హైన్ కౌన్, ఖల్‌నాయక్, సాజన్, తదితర హిట్ చిత్రాల్లో మాధురీ నటించారు. మాధురీ నటించిన 'ఫేమ్ గేమ్' వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాతగా ఈ సిరీస్ తెరకెక్కింది. 



Also Read: Indian Railway: ఇండియన్ రైల్వే మరో రైలురాయి.. దేశవ్యాప్తంగా 6100 స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు...


Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 టైటిల్ పోరుకు సిద్ధమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రోబబుల్ లెవెన్‌లో ఎవరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook