Kurchi Madatha petti song promo
అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కానంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ చిత్రం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన మాస్ సాంగ్ చిన్న వీడియో క్లిప్ మహేష్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్ది రోజులగా ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న మూవీ టీం.. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. మొదటి సాంగ్‌ని మాస్ బీట్ తో రెడీ చేసిన మూవీ టీం.. సెకండ్ సాంగ్ లవ్ బీట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. కాగా ఇప్పుడు మళ్ళీ మరోసారి ఊర మాస్ సాంగ్ విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ మూడో సాంగ్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు. ‘కుర్చీ మడతపెట్టి’ అనే ట్రేండింగ్ డైలాగ్ ని తీసుకోని పాటని రాసారు. ఈరోజు విడుదల చేసిన ఈ చిన్న ప్రోమోలో మహేష్, శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది. థియేటర్ లో ఈ సాంగ్ కి నిజంగా కుర్చీలు ఇరిగిపోవాల్సిందే. చాలా వరకూ క్లాస్ గా ఉండే స్టెప్పులేసే మహేష్ కూడా ఈ పాటలో స్పీడు పెంచాడు. ఇక శ్రీలీల గురించి చెప్పాలా..మామూలుగానే సూపర్ డాన్సర్ అయిన శ్రీలీల ఈ పాటలో తన మాస్ అండ్ క్యూట్ స్టెప్పులతో ఇరగదీసింది.


 



కాగా కుర్చీ మడత పెట్టి అని సాగిపోయే ఈ పూర్తి పాట శనివారం (డిసెంబర్ 30) రిలీజ్ చేయనున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఈ ఫుల్ సాంగ్ ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.


ఇక సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాకు హనుమాన్, ఈగల్, నా సామి రంగ లాంటి సినిమాలు పోటీగా నిలవనున్నాయి. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ బాబు.. రాగానే గుంటూరు కారం ప్రమోషన్లలో బిజీ కానున్నాడు. 


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter