Unstoppable With Nbk: బాలయ్య షోకు మరోసారి గెస్ట్ గా రానున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయనతోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. బాలయ్య షోకు విచ్చేయనున్నారని టాక్. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అన్‌స్టాప‌బుల్‌కు గెస్ట్‌లు రానున్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేయనున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ వ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్‌కు మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఆ స‌మ‌యంలో త్రివిక్ర‌మ్‌ను షోకు తీసుకువ‌స్తాన‌ని బాల‌కృష్ణ‌కు సూపర్ స్టార్ మాట కూడా ఇచ్చారు. దానిని నిజం చేయడానికి త్రివిక్ర‌మ్‌తో క‌లిసి బాలయ్య షోకు హాజరుకానున్నారట మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో  అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ గుంటూరు కారం సినిమాకు బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. జనవరి మెుదటి వారంలో ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీగా అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరాం, జగపతి బాబు,  ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


Also Read: Guntur Kaaram Second Single: గుంటూరు కారం ‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి